తెలంగాణ: రామోజీ ముందుచూపు

రామోజీరావు నడిపిస్తున్న ఈటీవీ2 చానెల్ లో అటువంటి చర్చలు ఉండడం లేదు. తెలంగాణ, సమైక్యాంధ్రుల మధ్య కయ్యం పెట్టే చర్చలకు ఆ చానెల్ ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అలాగే, ఈనాడు దినపత్రికలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా విశ్లేషణాత్మక కథనాలు రావడం లేదు. మిగతా కొన్ని దిన పత్రికలు మాత్రం కేంద్ర హోం మంత్రి చిదంబరంపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కూడా వార్తాకథనాలు ప్రచురించాయి. గత హోం మంత్రి శివరాజ్ పాటిల్ కు పట్టిన గతే చిదంబరానికి పడుతుందని హెచ్చరించాయి. ఇటువంటి వార్తాకథనాలు ప్రచురించే సమయంలో శివరాజ్ పాటిల్ ఉద్వాసనకు గురైన అంశాల తీరును, చిదంబరం చేపట్టిన అంశానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా పట్టించుకోలేదు.
రామోజీరావుకు రాజకీయాల కన్నా వ్యాపారాలు ముఖ్యం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తన ప్రయోజనాలు దెబ్బ తినకుండా జాగ్రత్త పడుతున్నారు. పైగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తన ప్రత్యర్థి వైయస్ జగన్ పై తీవ్రమైన దెబ్బ పడుతుందనే విషయం రామోజీకి తెలియంది కాదు. జగన్ ప్రాబల్యం తగ్గడం రామోజీరావుకు ఇష్టం కాబట్టి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంత వ్యతిరేకత ప్రదర్శించడం లేదని అనుకోవాలి. ఈనాడు సమైక్యాంధ్ర ఆందోళనలకు, తెలంగాణ ఆందోళనలకు సమప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ రకంగా నిష్పాక్షికత ప్రదర్శించామని అనిపించుకోవడానికి, తెలంగాణ ప్రజల మద్దతు సంపాదించుకోవడానికి ఆయనకు ఉపయోగపడవచ్చు. మొత్తంగా రామోజీ రావు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు తోస్తోంది.












Click it and Unblock the Notifications