వైయస్ జగన్ వార్

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కె. రోశయ్యపై సమరానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది. తన సమరంలో పట్టువిడుపులు మాత్రమే ఉంటాయి గానీ వెనక్కి తగ్గడం ఉండదనే విషయాన్ని ఆయన ఆచరణలో చూపుతున్నారు. ఓదార్పు యాత్రకు ముందు రోశయ్యను కలిసి రాజీకి రావడం తాత్కాలికమేనని, అది ఎత్తుగడలో భాగం మాత్రమేనని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఓదార్పు యాత్ర పూర్తి కాగానే తిరిగి తన సహజసిద్ధమైన పోరాటానికి పూనుకున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆసరాగా తీసుకుని ఆయన రోశయ్య ప్రభుత్వంపై పోరు సాగిస్తున్నారు.

సాక్షి దిన పత్రికలో వరుసగా రోశయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తాకథనాలు వస్తున్నాయి. కోతల ప్రభుత్వమని అంటూ ఇటీవల సాక్షి దినపత్రికలో పతాక శీర్షిక కింద వార్తాకథనం ప్రచురించారు. సంక్షేమ పథకాలకు రోశయ్య ప్రభుత్వం కోతలు పెడుతుందనేది ప్రధాన ఆరోపణతో ఆ వార్తాకథనం ప్రచురితమైంది. సంక్షేమ పథకాలు క్రమంగా రద్దవుతాయనే సూచనను ప్రజలకు చేస్తూ తాను వస్తేనే వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కొనసాగుందని ఆయన చెప్పదలుచుకున్నారు. దీన్నిబట్టి రోశయ్య ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఆయన సమయం కోసం వేచి చూస్తున్నారనే అభిప్రాయ కలుగుతోంది.

మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేకుండా జగన్ ఎప్పటికప్పుడు అడ్డంకులు కల్పిస్తూ వస్తున్నారు. తన సొంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రోశయ్య అడుగు ముందుకేసిన ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం రావడం గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుత మంత్రులు చాలా మంది వైయస్ రాజశేఖర రెడ్డి అనుయాయులే. వైయస్ జగన్ మాటను కాదనలేనివారే. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నవారే. అందువల్ల మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగకుండా జగన్ చూస్తున్నారనే అభిప్రాయం ఉంది.

ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే జగన్ 2014 వరకు వేచి చూసే స్థితిలో లేరని అంటున్నారు. ఎన్నికలలోపే అధికారాన్ని కైవసం చేసుకుని దాన్ని తిరిగి అధికారంలోకి రావడానికి వాడుకోవాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. దాని కోసం ఆయన పావులు కదుపుతూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+