జగన్ కు శత్రువులెవరు?

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తనకు చాలా మంది శత్రులున్నారంటూ సోమవారం ఢిల్లీలో చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. నిజానికి, రాజకీయ నాయకులకు ప్రత్యర్థులుంటారు. శత్రువులుగా చాలా అరుదుగా ఉంటారు. వ్యాపార రంగంలో శత్రువులుంటారు. కానీ తనకు చాలా మంది శత్రువులున్నారు, అది మీడియాకు కూడా తెలుసు అని జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనకు శత్రువై ఉండవచ్చు. ఎందుకంటే, ఆయన కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఓబుళాపురం గనుల కంపెనీపై నిరంతర పోరు సాగిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డితో జగన్ కు వ్యాపార లావాదేవీలున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే.

నిజానికి, వైయస్ రాజశేఖర రెడ్డి శత్రువులే జగన్ శత్రువులై ఉండాలి. వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని అధికారం చెలాయిస్తున్న సమయంలో నోరు మెదపని శత్రువులు ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అనుకోవచ్చు. అలాగే, తమకు అన్యాయం జరిగినా వైయస్ హయాంలో నోరు విప్పని కాంగ్రెసు నాయకులు, సీనియర్ శాసనసభ్యులు ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా గట్టిగానే మాట్లాడుతున్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు సీనియర్ నాయకులంతా ఒక రకంగా వైయస్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు పలుమార్లు వైయస్ ఎదుటే తన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారంతా ఇప్పుడు కూడా వైయస్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కానీ జగన్ కు వ్యతిరేకంగా మాత్రం పాపులు కదుపుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అదంతా ఒక కొత్త లాబీని వైయస్ తయారు చేసుకోవడం వల్ల జరిగిన పరిణామంగానే చూడాల్సి ఉంటుంది.

అయితే, జగన్ గుర్తించని విషయం ఏమిటంటే - ఆయనకు అన్ని వేళలా అండదండలు అందించిన కొంత మంది జూనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా తనకు దూరమవుతున్నారనే విషయాన్ని. దానం నాగేందర్, రాంరెడ్డి వెంకటరెడ్డి వంటి మంత్రుల మాటల్లో తేడా వచ్చింది. ఓదార్పు యాత్ర వద్దనే అధిష్టానం మాటను జగన్ వినాల్సి ఉండిందనేది వారి అభిప్రాయం. వైయస్ కు రక్షణ కవచంలా నిలిచిన కాంగ్రెసు జూనియర్లంతా ఇప్పుడు జగన్ వైపు ఉంటారనేది కూడా భ్రమే అవుతుంది. ఇందుకు కారణం వైయస్ జగన్ వ్యూహం, అనుసరిస్తున్న వైఖరే కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు జగన్ అసలు శత్రులు ఆయన తొందరపాటేనని చెప్పాలి. అధికారం కోసం ఆయన సహనాన్ని ప్రదర్సించడం లేదు. ఓపికగా రాజకీయాలను నడిపి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే వ్యూహంతో కాకుండా ఏదో రీతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలనే తొందరపాటే అతని ప్రధాన శత్రువుగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+