బాబుకు వైయస్ జగన్ దెబ్బ

జగన్ ను సమర్థంగా ఎదుర్కోలేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని భావించి హైదరాబాద్ కేంద్రంగా ఆయన వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. ఆ వ్యూహరచనలో భాగంగానే తెలుగుదేశం సీనియర్ నాయకులు వైయస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చాలా కాలం వరకు జగన్ ను పట్టించుకోని ధోరణిలో వ్యవహరించిన చంద్రబాబు ఇటీవలి కాలంలో విమర్శలకు దిగుతున్నారు. వైయస్ జగన్ పై, దివంగత నేత వైయస్సార్ అక్రమ వ్యవహారాలపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. జగన్ సంపాదనపై ఆయన నిరంతరంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా, జగన్ ముందస్తుగా 84 కోట్ల రూపాయల పన్ను చెల్లించడంపై కూడా ఆయన ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పై తెలుగుదేశం నాయకులు ప్రతి రోజూ విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఎర్రంనాయుడు, వర్ల రామయ్య, గాలి ముద్దు కృష్ణమ నాయుడు, యనమల రామకృష్డుడు వైయస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు.
పాపపు సొమ్ముతో వైయస్ జగన్ ఆధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ఒక రకంగా కాంగ్రెసులోని జగన్ వ్యతిరేకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకే గొంతుతో జగన్ పై విరుచుకుపడుతున్నారు. జగన్ వ్యవహారాన్ని చంద్రబాబు కేవలం కాంగ్రెసు పార్టీ అంతర్గత వ్యవహారంగానే చూడడం లేదు. తనకు జరిగే నష్టాన్ని పసిగట్టి ఆయన ముందస్తు చర్యలకు దిగారు. దాంతో వైయస్ జగన్ కు, చంద్రబాబుకు మధ్య పోరుగా ప్రస్తుత వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications