చిరంజీవి ఆశలపై మళ్లీ నీళ్లు?

డిఎస్‌కు దక్కిన ఎమ్మెల్సీ సీటును చిరంజీవి తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావుకు ఇప్పించడానికి ప్రయత్నించారు. ఆయన ఒకటి తలిస్తే అధిష్టానం మరోటి తలిచింది. సకల జనుల సమ్మె ముగిసి, పరిస్థితి సాధాణరమైందని భావించి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు పూనుకుంటారనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలో మళ్లీ చిరంజీవి శిబిరంలో ఆశలు చిగురించాయి. కనీసం ఇద్దరు, ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయని ఆశపడ్డారు. కానీ, శాసనసభ్యుల వలసలు ఆశలపై నీళ్లు చల్లాయి.
చిరంజీవికి చెందిన 17 మంది శాసనసభ్యులను కలుపుకుంటే కూడా కాంగ్రెసు శానససభ్యుల సంఖ్య శానససభలో చాలా తక్కువగా ఉంది. మజ్లీస్ శానససభ్యులను కలుపుకుంటే తప్ప మెజారిటీ లేని స్థితి వచ్చి పడింది. చిరంజీవి ప్రభుత్వానికి స్థిరత్వాన్ని సాధించి పెట్టారనే అభిప్రాయం బలంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మరింత మంది కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలు చేసి తెరాసలోకి వెళ్తారనే ఊహాగానాలు పెద్ద యెత్తున చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోవచ్చునని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి వస్తే కాంగ్రెసును రాష్ట్రంలో అధికారంలోకి తేవాల్సిన అనివార్యమైన స్థితిలో చిరంజీవి పడిపోయే అవకాశం ఉంది. వ్యూహరచనలు వేరే నేతలు చేసినా స్టార్ కాంపైనర్‌గా చిరంజీవే ఉంటారు. పార్టీ జయాపజయాల ప్రభావం ఆయనపై తీవ్రంగా పడవచ్చు.












Click it and Unblock the Notifications