జగన్‌ను టార్గెట్ చేసిన లోకేష్ చానెల్

జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టుగా కాంగ్రెసు ప్రభుత్వానికి కూడా తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుందని ఆరోపించింది. జగన్ అక్రమాల్లో కాంగ్రెసు పెద్ద నేతలకు కూడా సంబంధం ఉండటం వల్లనే పార్టీ అధిష్టానం నోరు విప్పడం లేదన్నారు. కాంగ్రెసు నేతలు కూడా జగన్ అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని వేలకోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారని చెప్పారు. వైయస్ హయాంలో హస్తినకు మూటలు చేరాయని చెప్పారు. అప్పుడు మూటలు అందటం వల్లనే ఇప్పుడు కాంగ్రెసు పార్టీ జగన్ ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత వ్యతిరేకించినా స్పందించడం లేదని చెప్పారు. ప్రధాన వాటాదారుగా ఉన్న కాంగ్రెసు చర్యలు ఇకముందు కూడా తీసుకునేందుకు ముందుకు రాదని తెలిపింది.
గతంలో జగన్ ఎంత పన్ను కట్టారు. ఇప్పుడు ఎంత పన్ను కట్టారు. ఇటీవలె జగన్ 84 కోట్ల రూపాయల ముందస్తు పన్ను కట్టారు. అయినా ఐటి శాఖ స్పందించకపోవడాన్ని వారు తప్పుపట్టారు. కొందరిపై ఐటి దాడులు చేయడం, మరికొందరిపై దాడులు చేయకపోవడాన్ని చూస్తుంటే అవినీతి నాలుగు పాదాలపై నడుస్తుందనే విషయం ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. కాంగ్రెసు, జగన్ వ్యవహారాలు చూస్తుంటే దొంగాట అడుతున్నట్టుగా ఉందన్నారు. ఆ దొంగాటలో పావులు మాత్రం ప్రజలే కావడం శోచనీయమన్నారు. అయితే అవినితి సొమ్ముతో పత్రికలు, టీవీలు పెట్టి, ఓబుళాపురం గనులు నిర్వహిస్తూ కాంగ్రెసుతో జగన్ దొంగాట ఆడుతున్నంత కాలం వారు దొరలే అవుతారని చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications