ముగ్గురు నేతలవి మూడు దారులు

Damodara Rajanarasimha-Kiran Kumar Reddy-Botsa Satyanarayana
రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంత కాలం గుట్టు చప్పుడు కాకుండా సాగిన వ్యవహారాలు ఆ తర్వాత ఒక్కసారిగా బయటపడ్డాయి. వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు, తెలంగాణ అంశం రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నాయి. వయసు పైబడినందున రోశయ్య వ్యవహారాలను చక్కదిద్దలేకపోతున్నారని, ఏరి కోరి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఏదో పొడిచేస్తారని అనుకున్నారు. ఆయన ముక్కుసూటిదనం, కచ్చితత్వం పార్టీని గాడిలో పడేస్తుందని పార్టీ అధిష్టానం నమ్మకం పెట్టుకుంది. అయితే, పరిస్థితి ఏ మాత్రం దారిలోకి రాలేదు. పైగా, మరింతగా విషమించింది. తెలంగాణలోని మాదిగ నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ నినాదం కాస్తా తగ్గుముఖం పడుతుందని అనుకున్నారు. ఆయన పరిస్థితిని అదుపులోకి తెస్తారని అనుకున్నారు. కానీ, అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాలనను, పార్టీ వ్యవహారాలను గాడిలో పెడతారని ఎన్నో అశలు పెట్టుకున్న అధిష్టానం ఆశలు వమ్మయ్యాయి. దీంతో తీవ్ర నిరాశకు, అసంతృప్తికి లోనట్లవుతున్నట్లు సమాచారం.

దామోదర రాజనర్సింహను ముఖ్యమంత్రిని చేయడం వల్ల తెలంగాణ నాయకుల్లో అగ్గి మరింతగా రాజుకుంది. అధిష్టానానికి, ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మంత్రి గీతారెడ్డి ఆ పదవిని ఆశించి భంగపడిన తర్వాత తెలంగాణపై తన గొంతును పెంచారు. తన అసంతృప్తికి తెలంగాణ డిమాండును ఆలంబనగా చేసుకున్నారు. నిజానికి, తెలంగాణకు చెందిన చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు పదవులపై అసంతృప్తితో అసమ్మతి తెలంగాణ ఉద్యమ రూపంలో వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయం ఉంది.

పార్టీ వ్యవహారాలను, ప్రభుత్వ పాలనను చక్కదిద్దాల్సిన కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ మధ్య సమన్వయం కూడా లోపించింది. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ అప్పుడప్పుడు మీడియా ముందు గళం విప్పుతున్నా దామోదర రాజనర్సింహ మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. మొత్తం మీద, రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+