కెసిఆర్‌ను టార్గెట్ చేసిన సీమాంధ్ర నేతలు

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును సీమాంధ్ర కాంగ్రెసు నేతలు టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. తెలంగాణ రాకపోతే విషం తాగి చస్తానని కెసిఆర్ ఆదివారం చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. దానిపైనే సీమాంధ్ర నాయకులు తమ దృష్టిని కేంద్రీకరించారు. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. కెసిఆర్ చావకూడదని, జీవించి ఉండాలని ఆయన అన్నారు. చస్తానంటే కెసిఆర్‌ను చావనివ్వబోమని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు జోగి రమేష్ కెసిఆర్ కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాకపోతే కెసిఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరు ముందు తాగుతారో చెప్పాలని ఆయన సోమవారం విజయవాడలో డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. దళితులను, బడుగులను, బలహీన వర్గాల ప్రజలను బలి చేయాలని కెసిఆర్ చూస్తున్నారని ఆయన విమర్శించారు.

కెసిఆర్ నమ్మదగిన నాయకుడు కాడని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కెసిఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రతి మాట వెనక కూడా స్వార్థం ఉంటుందని ఆయన అన్నారు. కాగా, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు కూడా కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి కెసిఆర్ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వైయస్ జగన్ ప్లీనరీ కోసం కెసిఆర్ రైల్‌రోకోను రద్దు చేసుకున్నారని, తాము ధర్నా చేపడితే రాస్తారోకోలకు పిలుపునిచ్చారని, తమ ధర్నాకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకే అలా చేశారని తెలుగుదేశం మరో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+