వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌కు ఓకే: వైయస్‌కోసం జగన్ డిమాండ్, చిక్కే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

NT Rama Rao - YS Rajasekhar Reddy
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టేందుకు అనుమతి లభించడంతో ఇప్పుడు కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటు ఆవరణలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన ఎన్టీఆర్ తనయ, కేంద్రమంత్రి పురంధేశ్వరి కూడా తనవంతు ప్రయత్నాలు చేశారు. ఎంతో ప్రయత్నం తర్వాత పార్లమెంటు విగ్రహాల కమిటీ ఎన్టీఆర్ విగ్రహానికి పచ్చజెండా ఊపింది.

విగ్రహ నమూనాను ఆమోదించడంతో పాటు విగ్రహం ఇవ్వాలంటూ కేంద్రమంత్రి పురంధేశ్వరికి లోకసభ స్పీకర్ మీరా కుమార్ బుధవారం లేఖ రాశారు. ఎన్టీఆర్ విగ్రహం తర్వాత ఇప్పుడు కొత్త డిమాండ్ తెర పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ డిమాండ్ కాంగ్రెసు అధిష్టానాన్ని చిక్కుల్లో కూడా పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత వైయస్ రాజశఖర రెడ్డి విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు పార్లమెంటు పచ్చజెండా ఊపే వరకు ఆగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తమ డిమాండ్‌ను తెర పైకి తీసుకు రావచ్చునని అంటున్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం కోసం టిడిపి డిమాండ్ చేసింది. కాంగ్రెసులో ఉన్న పురంధేశ్వరి కూతురు కాబట్టి ప్రయత్నాలు చేసింది. అయితే అధికార కాంగ్రెసు పార్టీ నుండి ఎలాంటి డిమాండ్ రాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ టిడిపి వ్యవస్థాపకులు కాబట్టి.

కానీ వైయస్ విషయంలో మాత్రం కాంగ్రెసు చిక్కుల్లో పడే అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు. వైయస్ విగ్రహం మేం ఇస్తామని, పార్లమెంటులో ఏర్పాటు చేయాలని జగన్ డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే జగన్‌కు రాష్ట్ర కాంగ్రెసు నేతలు వంత పాడాల్సి ఉంటుందంటున్నారు. వైయస్ కాంగ్రెసు సిఎంగా పని చేశాడు. ఇప్పటి వరకున్న అత్యుత్తమ ముఖ్యమంత్రులో వైయస్ ముఖ్యమైనవాడని, ఆయన తమ వాడేనని కాంగ్రెసు చెబుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ డిమాండుకు వారు కూడా మద్దతు పలకాల్సి ఉంటుంది. లేదంటే వైయస్సార్ కాంగ్రెసు వారిని ప్రశ్నించే అవకాశం ఉంది. వైయస్‌ను తమ పార్టీ నేతగా చెప్పుకున్న కాంగ్రెసు పార్లమెంటులో ఆయన విగ్రహం కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదని వైయస్సార్ కాంగ్రెసు ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఇప్పటికే సిబిఐ ఛార్జీషీటులో ఆయన పేరును పెట్టడాన్ని వ్యతిరేకించక పోవడాన్ని జగన్ పార్టీ ప్రశ్నిస్తోంది. మరోవైపు పురంధేశ్వరిని టిడిపి పలుమార్లు నిలదీసిన సందర్భాలు కూడా మనం చూశాం.

English summary
It is said that YSR Congress party chief YS Jaganmohan Reddy may demand to install late YS Rajasekhar Reddy statue in Parliament after late Nandamuri Taraka Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X