వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలకు కర్ణాటక మాజీ స్పీకర్ సలహాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
అనర్హత వేటు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నట్లు సమాచారం. జగన్ వర్గం శాసనసభ్యులు కర్ణాటక మాజీ స్పీకర్ సలహాలను పొందుతున్నట్లు ఆయనకు సమాచారం అందినట్లు చెబుతున్నారు. దీంతో నాదెండ్ల మనోహర్ వారికి అనర్హత నోటీసులు ఇచ్చే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తనకు పార్టీ జారీ చేసిన విప్ అందలేదని రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి చెప్పారు. దానిపై నాదెండ్ల మనోహర్ పరిశీలన జరిపినట్లు సమాచారం. కాపు రామచంద్రా రెడ్డి అందుబాటులో లేకపోవడంతో విప్ ప్రతిని ఆయన ఇంటి తలుపుల వద్ద జారవిడిచి వచ్చారని ఆ పరిశీలనలో స్పీకర్‌కు తెలిసింది.

దాంతో కాంగ్రెసు శాసనసభా పక్షం తాజా విప్ కాపీని అందజేసింది. ఈ పరిణామంతో కాపు రామచంద్రా రెడ్డి తనకు మళ్లీ నోటీసు ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. అదే విధంగా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అయోమయం కలిగించే పద్ధతిలో వ్యవహరించారు. తనకు ప్రజారాజ్యం జారీ చేసిన విప్ వర్తించదని ఆమె మొదట వాదించారు. ఆ తర్వాత ఆమె రాజీనామా చేశారు. తాజాగా ఆమె అనర్హత నోటీసుకు వివరంగా సమాధానం ఇచ్చారు. అనుభవం గల నిపుణుల సలహా మేరకే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో స్పీకర్ మనోహర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు.

తన ముందు హాజరు కావాలని జగన్ వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులను స్పీకర్ ఆదేశించారు. వారికి 18 నుంచి 21 మధ్య తేదీలను ఇచ్చారు. వారు స్పీకర్ ముందు హాజరై ఏం చెప్తారనేది వేచి చూడాల్సిందే.

English summary
The pro-Jagan Congress MLAs are reportedly being advised by a former speaker of Karnataka because of which the office of Nadendla Manohar wants to be extra careful in dealing with the disqualification notices, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X