అన్ని చోట్లా సెంటిమెంట్‌దే విజయం

స్టేషన్ ఘనపూర్‌లో టి. రాజయ్య గతంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. తెలంగాణవాదాన్ని ఢీకొన్ని ఆయన విజయం సాధించారు. ఆ లెక్కన చూస్తే తెలంగాణవాదం వల్ల టి. రాజయ్య ఇప్పుడు విజయం సాధించారని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరికి వ్యక్తిగత బలం ఉంది. దానివల్ల అది రెండో స్థానంలో వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. నిజానికి, తెలంగాణ పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని ప్రజలు గుర్తిస్తే కడియం శ్రీహరి గెలవాల్సిన అభ్యర్థి. నాగం జనార్దన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎదుర్కుని విజయం సాధించారు. జూపల్లి కృష్ణారావు కూడా గతంలో కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు తెరాస అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. ఆదిలాబాద్ కూడా గతంలో తెలుగుదేశం సీటు. ఇప్పుడు అది తెరాస ఖాతాలో చేరిపోయింది.
కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం ఆ పార్టీకి నైతికంగా బలం చేకూర్చేదే. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం ఏకపక్షం కాలేదు. గతంలో నల్లపురెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడది వైయస్సార్ కాంగ్రెసు ఖాతాలో చేరిపోయింది. ఈ మేరకు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు తమ స్థానాలను పోగొట్టుకున్న వైనం చూడవచ్చు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఏకమైతే తెరాసను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోగల సత్తాను చూపించగలుగుతాయని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications