వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తు 'పై' ఎత్తు: తెలంగాణ, ఎవరితో ఎవరో?

By Srinivas
|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర సమితి సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వేడి మరింత రంజుగా మారిపోయింది. వైయస్సార్ కాంగ్రెసు కేవలం సీమాంధ్రకే పరిమితం అవుతుందని భావించిన కెసిఆర్ ఇన్నాళ్లూ కేవలం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. జగన్ కూడా తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నారని తెలియడంతో తెరాస ఆ పార్టీపై కూడా విమర్శలు ప్రారంభించింది.

పొత్తు 'పై' ఎత్తు: తెలంగాణ, ఎవరితో ఎవరో?

ముందస్తు ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు అయినా తెలంగాణ అంశమే ప్రధానంగా మారనుంది. పార్టీల పొత్తుల విషయమై ఇదే ప్రధానం కానుంది. ఇటు సీమాంధ్ర అటు తెలంగాణలోనూ ఓట్లు వేసే ప్రజలకు అభ్యర్థులు, పార్టీలు సమైక్యాంధ్ర, ప్రత్యేక వాదంపై ప్రచారంలో తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.

పొత్తు 'పై' ఎత్తు: తెలంగాణ, ఎవరితో ఎవరో?

మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు పొత్తు పెట్టుకోవచ్చుననే వాదనలు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణలో తమ పట్టు కోల్పోకుండా తెరాస, పట్టు బిగించేందుకు వైయస్సార్ కాంగ్రెసు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఉండయని అంటున్నారు.

పొత్తు 'పై' ఎత్తు: తెలంగాణ, ఎవరితో ఎవరో?

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఒంటరి పోరాటం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ పార్టీ దగ్గరకు వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. మరోవైపు తెలంగాణ ఎంపీలు సొంత ఫ్రంట్‌తో ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసుకు వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవు.

పొత్తు 'పై' ఎత్తు: తెలంగాణ, ఎవరితో ఎవరో?

తెలుగుదేశం పార్టీతో కూడా ప్రధాన పార్టీలు ఏవీ పొత్తుకు సిద్ధంగా లేవు. తెలంగాణపై బాబు వెనక్కి వెళ్లారని తెరాస విమర్శిస్తోంది. ఇక కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసుతో ఎలాగూ కలిసి వెళ్లరు. బిజెపితో కలిసి వెళ్లేందుకు టిడిపియే ఇష్ట పడటం లేదు. సిపిఐ ఒక్కటే కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. సిపిఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

పొత్తు 'పై' ఎత్తు: తెలంగాణ, ఎవరితో ఎవరో?

తెలంగాణవాదం గట్టిగా వినిపిస్తున్న భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒంటరి పోరుకు సిద్ధంగా ఉంది. అయితే జెఏసి తెరాసతో సంధి కుదుర్చితే బిజెపి రాజీకి వచ్చే అవకాశముంది.

పొత్తు 'పై' ఎత్తు: తెలంగాణ, ఎవరితో ఎవరో?

షర్మిల వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ వేడిని మరింత పెంచాయి. కెసిఆర్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలన్న కామెంట్ పైన తెరాస ధీటుగా స్పందించింది.

అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఆ పార్టీ నేత షర్మిల కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి, మాటల పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది. బయ్యారం గనుల్లో తమ పాత్ర లేదంటే కెసిఆర్ చిన్నవాళ్లమైనా తమ కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పగలరా అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెరాస కూడా ధీటుగానే స్పందించింది. కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత.. కెసిఆర్ కాళ్లు పట్టుకుంటారో మీ పీక పట్టుకుంటారో చూద్దామని సవాల్ విసిరారు.

టిడిపితో పాటు వైయస్సార్ కాంగ్రెసును, చంద్రబాబుతో పాటు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని తెరాస ఏకీపారేస్తోంది. ఎవరికి వారు తెలంగాణలో తమ పట్టు బిగించే ప్రయత్నాలు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, టిఆర్ఎస్‌తో పాటు బిజెపి, కాంగ్రెసులు కూడా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎత్తులు ఎలా ఉంటాయి? ఏ రాజకీయ పార్టీ ఎవరితో కలుస్తుంది? ఎవరు ఒంటరిగా పోటీ చేయనున్నారు? అనే అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అధికార కాంగ్రెసు పార్టీతో ఎవరూ కలిసే అవకాశం లేదని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని టిడిపి, టిఆర్ఎస్‌లు విమర్శిస్తున్నాయి. ఆ విమర్శల్లో నిజం ఎంతైనా అదే వాస్తవమైనా ఆ రెండు పార్టీలు 2014లో కలిసే ప్రసక్తి లేదంటున్నారు. టిడిపిని, టిఆర్ఎస్‌ దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే వారు కలువక పోవచ్చునని, ఎన్నికల తర్వాత ఒక్కటైతే మాత్రం చెప్పలేమంటున్నారు.

అదే అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు ఒంటరిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెసుతో పొత్తుకు ఇటు తెరాస లేదని చెబుతున్నారు. ఇక కాంగ్రెసు పార్టీ వ్యతిరేక పునాదులపై పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎలాగూ కలువదు. కమ్యూనిస్టు పార్టీలను దరి చేర్చుకుందామని కాంగ్రెసు భావిస్తున్నప్పటికీ ఆ పార్టీలు మాత్రం దూరంగా పోతున్నాయి.

వైయస్సార్ కాంగ్రెసు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. టిడిపి ఎలాగూ కలువదు. సిపిఐ ఇప్పటికే తేల్చేసింది. సిపిఎం త్రిశంకు స్వర్గంలో కొట్టుకుంటుంది. ప్రారంభంలో సిపిఎం జగన్ పార్టీ వైపు మొగ్గు చూపినప్పటికీ ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అవినీతిని ప్రశ్నిస్తోంది. దీంతో సిపిఎం కూడా దూరంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. ఇక టిఆర్ఎస్‌తో పొత్తు ఉండవచ్చునని ఇన్నాళ్లూ అందరూ భావించారు.

కానీ ఇటు తెరాస పట్టు కోల్పోకుండా ఉండేందుకు అటు వైయస్సార్ కాంగ్రెసు పట్టు బిగించేందుకు ఉబలాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు తమకు వంద సీట్లు అంటే తమకు 70 సీట్లు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దోస్తీ కుదరదనే అంటున్నారు.

అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే జగన్ తెలంగాణ వ్యతిరేకి అని, పార్లమెంటులో వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నారని తెరాస విమర్శలు చేస్తోంది. ఒకవేళ దోస్తీ కుదుర్చుకుందామనుకున్నా అలాంటి విమర్శలు చేసిన తర్వాత మళ్లీ పొత్తు పెట్టుకుంటే ప్రజలు హర్షించరనే భావన తెరాసలో ఉంది. సిపిఐతో కలిసి పోయేందుకు కెసిఆర్ సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేసినా 100 అసెంబ్లీ, 16 అసెంబ్లీ స్థానాలను ఒంటరిగానే గెలిచే సత్తా ఉందని కెసిఆర్ భావిస్తున్నారు.

తెలంగాణవాదం వినిపిస్తున్న భారతీయ జనతా పార్టీతోనూ పొత్తుకు కెసిఆర్ సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది. బిజెపి కూడా ఇప్పటికే తాము 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అయితే తెలంగాణవాద పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే తెలంగాణ ఓట్లు చీలి సమైక్యవాద పార్టీలకు లాభం చేకూరుతుందన్న ఉద్దేశ్యంలో జెఏసి ఉంది. ఎన్నికలు సమీపించే సమయానికి జెఏసి తెరాస - బిజెపి మధ్య సంధి కుదిర్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కెసిఆర్ కూడా ఇటీవల బిజెపిని తన టార్గెట్ నుండి పక్కన పెట్టేశారు.

2004లో కాంగ్రెసు తెరాసతో కలిసి పోటీ చేసి విజయం సాధించింది. ఇప్పటి వరకు తెలంగాణపై తేల్చలేదు. దీంతో తెరాస కాంగ్రెసుతో కలిసి పోటీ చేసే అవకాశాలు లేవు. అలాగే టిడిపితో కూడా. 2009లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. చంద్రబాబు వచ్చిన తెలంగాణను అడ్డుకున్నారనేది తెరాస వాదన. అయితే కాంగ్రెసు ఎంపీలు ఆ పార్టీ తరఫున కాకుండా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్త ఫ్రంట్ - తెరాస కలిసి 2014 ఎన్నికల బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కాంగ్రెసు ఒంటరిగా, వైయస్సార్ కాంగ్రెసు ఒంటరిగా లేదా సిపిఎంతో, తెలుగుదేశం పార్టీ సిపిఐతో, తెరాస తెలంగాణ కాంగ్రెసు ఎంపీల ఫ్రంట్‌తో కల్సి, బిజెపి ఒంటరిగా పోటీ చేసే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. జెఏసి బిజెపి - తెరాసల మధ్య విభేదాలను పూడ్చితే ఇరు పార్టీలు కల్సి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో 'తెలంగాణ'నే ప్రధానాంశం కానుందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

English summary
Telangana will be the main factor in next general elections for parties alliances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X