తిరుపతి: చిరుకు ఇజ్జత్‌కా సవాల్, భూమన హుషార్

మిగిలిన నియోజకవర్గాలలో పార్టీకి వెన్నెముకలాంటి అభ్యర్థులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్లారు. దీంతో అక్కడ అభ్యర్థులను వెతికి మరీ పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! కానీ తిరుపతి అందుకు మినహాయింపు. చిరంజీవి రాజీనామా చేసినప్పటికీ ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. దీంతో మిగిలిన స్థానాలలో గెలుపోటములు ఎలా ఉన్నా తిరుపతిలో గెలుపు కాంగ్రెసుకు ముఖ్యంగా చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మకం. పదిహేడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు జగన్ కారకుడైతే తిరుపతి ఎన్నికకు మాత్రం చిరంజీవి కారణం!
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం చిరంజీవికి వ్యక్తిగతంగా ఇజ్జత్‌కా సవాల్‌గా మారింది. ఇక... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల సొంత జిల్లా కావడంతో తిరుపతికి రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగింది. తిరుపతి ఉప ఎన్నికల బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులున్నా... కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రమణ, టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకర రెడ్డి మధ్యే హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రత్యర్థుల భూ ఆక్రమణలు, జగన్ అక్రమాస్తులు, రాష్ట్ర మంత్రుల అవినీతిని తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది.
అభివృద్ధి, జగన్ అవినీతిపైనే కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇక జగన్ పార్టీ... వైయస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, జగన్‌కు జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ ముందుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో కులాల వారీగా ఓట్లు చీలిపోయే వాతావరణం గతంలో కన్నా స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ ఓట్లు ఇద్దరి మధ్య చీలే అవకాశం కనిపిస్తోంది. ఇతర కులాల్లో కమ్మ సామాజికవర్గం టిడిపి వైపు, రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ శాతం జగన్ పార్టీ వైపు మొగ్గే పరిస్థితి కనిపిస్తోంది.
వీరు కాక నియోజకవర్గంలో 73 వేల మంది బిసి, 25 వేల మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు ఎటు మొగ్గితే వారికే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా, ప్రజారాజ్యం పార్టీ విలీనంతో పాటు టిడిపి నేతలు కొందరు కాంగ్రెస్‌తో చేయి కలపడంతో... ఆ పార్టీ కొత్త శక్తిని సమీకరించుకుంది. పలు కుల సంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయి. కాగా, టిడిపికి సాంప్రదాయ ఓటర్లకు తోడు అభ్యర్థి చదలవాడ వ్యక్తిగత పలుకుబడి, ఆయన సామాజిక వర్గం ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. కమ్మ సామాజికవర్గంలో అత్యధిక శాతం టిడిపి అభ్యర్థినే బలపరుస్తున్నారని అంటున్నారు.
కాగా, ఎన్నికల తేదీ ప్రకటనకు ముందునాటి సర్వేల్లో ప్రజా మద్దతులో అగ్రస్థానంలో ఉన్నట్టు కనిపించిన జగన్ పార్టీ... ఆ తర్వాతి పరిణామాల్లో ఇరకాటంలో పడినట్లు కనిపిస్తోంది. లీలామహల్ స్థలం కబ్జా ప్రయత్నాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలతో జగన్ వర్గ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. జగన్ అరెస్టు తరువాత సానుభూతి పోటెత్తుతుందని భావించినప్పటికీ... అంతలా కనిపించలేదని అంటున్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కొన్ని సామాజికవర్గాలు మాత్రం ఇప్పటికీ జగన్ పార్టీ వెంటే నడుస్తున్నాయి. ప్రధానంగా రెడ్డి, ఎస్సీ వర్గాల్లో ఈ పార్టీకి బలం కనిపిస్తోంది. దీంతో గెలుపుపై భూమన గట్టి నమ్మకంతో ఉన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications