రాయచోటి: శ్రీకాంత్ రెడ్డికి గట్టి పోటీయే...

Srikanth Reddy
డప జిల్లా రాయచోటి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుంచి గట్టి పోటీయే ఎదురు కానుంది. అయితే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సొంత జిల్లా కావడంతో శ్రీకాంత్ రెడ్డికి కొంత మేరకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన శ్రీకాంత్ రెడ్డి ఆ తర్వాత జగన్ వైపు మళ్లారు. కాంగ్రెసు పార్టీ విప్ ధిక్కరించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి తండ్రి జి.మోహన్‌రెడ్డి, ఆయన పెద్దతండ్రి జి.రామసుబ్బారెడ్డి, ఆయన సోదరుడు జి.ద్వారకనాథరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారి కుటుంబ సభ్యులు నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం తనకు అండగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

రాయచోటీలో కాంగ్రెస్ తరఫున ఎం.రాంప్రసాద్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫన సుగవాసి సుబ్రమణ్యం పోటీ చేస్తున్నారు. వీరి అభ్యర్థిత్వాన్ని ఆయా పార్టీలు ముందుగానే ఖరారు చేయడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా మైనార్టీల ఓట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో మైనారిటీల ఓట్లు కొల్లగొట్టేందుకు నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

అభ్యర్థుల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్.సుబ్రమణ్యం జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన తండ్రి ఎస్.పాలకొండ రాయుడు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన చిన్న కుమారుడు ఎస్.ప్రసాద్‌బాబు (చిన్నరాయుడు) మండల పరిషత్, మున్సిపాలిటీలలో ఎంపిటిసి, కౌన్సిలర్‌గా పనిచేశారు. వీరు ముగ్గురితో పాటు సుగవాసి కుటుంబానికి చెందిన మరో 20 మంది కుటుంబ సభ్యులు నియోజకవర్గ వ్యాప్తంగా తమకున్న రాజకీయ చతురతతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం జిల్లా కన్వీనర్ ఎం.లింగారెడ్డి, ఎంపి సి.ఎం.రమేష్‌నాయుడు, పుట్టా సుధాకర్‌యాదవ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.రాంప్రసాద్‌రెడ్డి పిసిసి ప్రతినిధిగా పనిచేశారు. ఆయన తండ్రి దివంగత నేత ఎం.నాగిరెడ్డి, ఆయన సోదరుడు ఎం.నారాయణరెడ్డి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాంప్రసాద్‌రెడ్డి కుటుంబానికి లక్కిరెడ్డిపల్లెకు చెందిన మాజీ మంత్రి ఆర్.రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి అండగా ఉన్నారు. వీరి సాయంతో రాంప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

రాయచోటి మూడు పార్టీల అగ్ర నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీలు కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో త్రిముఖ పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+