• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్‌ను జగన్‌కు: కౌంటర్‌గా తెరపైకి కొత్త పేరు

By Srinivas
|

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉపయోగించుకునే విషయంపై కాంగ్రెసు పార్టీలో ఇంకా చర్చోపచర్చలు జరుగుతున్నాయట. వైయస్ పేరును ఉపయోగించుకుందామని కొందరంటే లేదు పక్కన పెట్టాల్సిందేనని మరికొందరు చెబుతున్నారట. వైయస్ పేరును ఉపయోగించుకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లబ్ధి చేకూరుతుందని కాబట్టి ఆ పేరును వినియోగించడం పూర్తిగా మానేసి, జగన్‌కు వదిలేస్తేనే బాగుంటుందని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారట.

వైయస్ మరణించి మూడేళ్లు పూర్తి కావస్తున్నా.. ఆయన బొమ్మపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వెలువడుతూనే ఉన్నాయి. వైయస్ మనవాడే అని కొందరంటుంటే.. కాదుకాదు.. జగన్ పార్టీ వాడని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం పరిష్కారం దిశగా ఇందిరమ్మను ఫోకస్ చేద్దామని మంత్రి ధర్మాన ప్రసాద రావు నేతృత్వంలోని మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. అప్పట్లో వైయస్ కూడా ఆమె పేరు మీదే చాలా పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేసింది.

అయితే, పార్టీ నేతలపై ఇది అంత ప్రభావం చూపలేదు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేదా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వంటి ముఖ్య నాయకులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేతలు అంటున్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు వైయస్ బొమ్మలేదంటూ ప్రశ్నించినప్పుడు.. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తే వివాదం కొనసాగేది కాదని పేర్కొంటున్నారు.

ఆ కార్యక్రమంలో ఇందిర, రాజీవ్, సోనియా, మన్మోహన్, రాహుల్ గాంధీ ఫొటోలు మినహా ప్రస్తుత సిఎం, పిసిసి చీఫ్‌ల ఫొటోలు లేకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ విషాయాన్ని వివరించి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపి ఉంటే బాగుండేదని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు వదిలిపెట్టడమే మంచిదని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటికే వారు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నందున వైయస్ బొమ్మతో తమకు అంత ఉపయోగం ఉండకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా మాజీ ముఖ్యమంత్రి అంజయ్య పేరు తెరపైకి తీసుకురావడం కూడా ఓ వ్యూహం ప్రకారం తీసుకున్న నిర్ణయమేనని విశ్లేషిస్తున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద పలుకుబడి కలిగిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో సహా పలువురు నేతలు వైయస్ బొమ్మకు విరుగుడు మంత్రంగా అంజయ్య పేరును ప్రస్తావిస్తున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రులలో వైయస్ కూడా ఒకరని, ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎంపిలు హనుమంతరావు, జి.వివేక్, హర్ష కుమార్, మధుయాష్కీ గౌడ్ వంటి వారు పేర్కొంటున్నారు. అయితే రాష్ట్ర మంత్రులు కొందరు ఈ వాదనతో వ్యతిరేకిస్తున్నారు. బాహాటంగా దీనిపై మాట్లాడకపోయినా అంతర్గత సమావేశాల్లో మాత్రం వారు కెవిపి వాదనకు మద్దతు తెలుపుతున్నారట.

English summary

 Late YS Rajasekhar Reddy dilemma is going in Congress party now. Some leaders are against to use YSR photo in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X