ఆ ఐదు పార్టీలపై ప్లాన్ ఫలించేనా?(పిక్చర్స్)

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కాంగ్రెసు పార్టీ భావించడం వల్లనే విభజన నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పవచ్చు. యూపిఏ, సిడబ్ల్యూసి తీర్మానంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రం కూడా ఆ వైపుగా వడివడిగా అడుగులు వేస్తోంది.

విభజన ద్వారా కాంగ్రెసు పార్టీ ఒక్క దెబ్బకు అన్ని పార్టీలను ధీటుగా ఎదుర్కొనవచ్చునని భావిస్తోందని చెప్పవచ్చు. విభజన ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును వ్యూహాత్మకంగానే భాగస్వామిని చేయలేదు. మరోవైపు సీమాంధ్రలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను దెబ్బతీయడమే కాకుండా, తెలంగాణలో బిజెపి పుంజుకోకుండా చేసే ఉద్దేశ్యంలో భాగంగానే ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ప్రకటన చేసినప్పటికీ ఏ పార్టీ వచ్చే ఎన్నికల్లో నిలుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ఇచ్చిన పేరును కాంగ్రెసు దక్కించుకున్నా 2014 ఎన్నికల్లో కొంత లాభించినా అది ఎంతుంటుందనేది... తెరాస విలీనం పైన, పార్లమెంటులో బిల్లు పెట్టే విషయం పైన ఆధార పడి ఉంది. ఇక సీమాంధ్రలో కాంగ్రెసు కచ్చితంగా వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశముంది. ఎన్నికల నాటికి కొంత మేర పుంజుకున్నా టిడిపి సీమాంధ్రులకు న్యాయం పేరుతో, జగన్ పార్టీ సమైక్యం పేరుతో ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ మేరకు పుంజుకుంటుందనేది చూడాలి.

కాంగ్రెసు

కాంగ్రెసు

కాంగ్రెసు పార్టీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చాకచక్యంగా ఎన్నికలకు ముందు తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారు. తద్వారా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఇరకాటంలోకి నెట్టారనే చెప్పవచ్చు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని, మరోవైపు తెలంగాణను తెర పైకి తెచ్చి ఓట్ల వర్షం కురిపించుకోవాలనుకున్న భారతీయ జనతా పార్టీని కాంగ్రెసు పార్టీ ఇరకాటంలోకి నెట్టిందనే చెప్పవచ్చు. తెలంగాణ పేరుతోనే బిజెపి క్రమంగా బలపడుతోంది. ఈ నెల 11న మోడీ వస్తే తెలంగాణపై ప్రధానంగా మాట్లాడే వారు. ఇప్పుడు కాంగ్రెసు నిర్ణయం తీసుకోవడంతో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి తేల్చిచెప్పక తప్పని పరిస్థితి కల్పించారు. తొలి నుంచి సమైక్యవాద పార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా స్పందించింది. రెండు కళ్ల సిద్ధాంతంతో టిడిపి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా కనిపించింది. అయితే చంద్రబాబు మీకోసం పాదయాత్రతో పార్టీలో ఉత్తేజం తీసుకు రాగలిగారు. అంతలోనే కాంగ్రెసు తెలంగాణపై ప్రకటన చేసి మళ్లీ టిడిపిని ఇరకాటంలోకి నెట్టింది. టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెసు నిలిచింది. అయితే విభజనపై సీమాంధ్ర టిడిపి నేతలు పల్లెత్తు మాట అనక పోవడంతో తెలంగాణలో టిడిపిపై విశ్వాసం పెరిగిందనడంలో సందేహం లేదు. అయితే కాంగ్రెసు మాత్రం ముందంజలో నిలిచింది. సీమాంధ్రలో టిడిపిపై వ్యతిరేకత తీసుకు వచ్చేలా వ్యూహం రచించారు. అయితే ఇటీవల నేతలు వ్యూహాత్మకంగా విభజనకు వ్యతిరేకం కాదని కానీ, తమకు అన్యాయం జరిగిందని టిడిపి నేతలు రాజీనామాలు చేసి సీమాంధ్రలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు.

కె చంద్రశేఖర రావు

కె చంద్రశేఖర రావు

వంద సీట్లు, పదిహేను అసెంబ్లీ స్థానాల నినాదంతో కాంగ్రెస్ భవితనే శాసించాలని చూసిన కెసిఆర్‌కు ఎజెండాయే లేకుండా చేసే పథకం కాంగ్రెసు రచించింది. ఆయన జెండాను కాంగ్రెస్‌లో విలీనం చేయక తప్పని స్థితి కల్పించారు. తెలంగాణ ఇచ్చిన ఘనత మొత్తాన్నీ కాంగ్రెస్ ఖాతాలోనే వేసి, తెలంగాణ ఛాంపియన్ కావాలనుకున్న కెసిఆర్ ఆశలను వమ్ము చేశారనే చెప్పవచ్చు. ఇప్పుడు పలువురు తెరాస నేతలు కాంగ్రెసు వైపు చూస్తున్నారు కూడా.

వైయస్ జగన్

వైయస్ జగన్

కాంగ్రెసు పార్టీని ధిక్కరించి, సొంత కుంపటి పెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసు ఇప్పుడు చిక్కుల్లో పడేసింది. ఏటూ తేల్చుకోలేక ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది. టిడిపి విభజనకు తాము వ్యతిరేకం కాదని చెబుతూ సీమాంధ్ర నేతల ప్రయోజనాలు కూడా ముఖ్యమని చెబుతోంది. కానీ జగన్ పార్టీ నేతలు సమైక్యంగా ఉంచాలని రాజీనామాలు చేస్తూ, తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ చెబుతున్నారు. ఆ పార్టీలో గందరగోళం కనిపిస్తోందనే చెప్పవచ్చు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో ఖాళీ కావడం ఖాయమనే అంటున్నారు.

మజ్లిస్

మజ్లిస్

కాంగ్రెస్‌ను ధిక్కరించి, ఆ పార్టీ బుజ్జగింపులను అసహాయతగా తీసుకున్న మజ్లిస్ పార్టీ ఆ తర్వాత తమ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి, ముస్లిం ఓట్లను గంపగుత్తగా ఖాతాలో వేసుకోవడానికి ప్లాన్ వేశారు. కానీ విభజన ద్వారా అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఒవైసీ ప్రతిపాదించిన రాయల తెలంగాణకు నో చెప్పడం ద్వారా వారి వ్యూహానికి సోనియా ప్రతివ్యూహం రచించారు. మోడీ ప్రభావం నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలసి నడవక తప్పని అగత్యాన్ని కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+