తొడగొట్టి సవాల్: ఎన్టీఆర్ దాగుడుమూతలు(పిక్చర్స్)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో దాగుడుమూతలు ఆడుతున్నారని అంటున్నారు. జూనియర్‌కు సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పంచన చేరడం మొదలు ఫ్లెక్సీల రాజకీయం, తండ్రి నందమూరి హరికృష్ణ ఘాటు వ్యాఖ్యల నుండి నిన్నటి ఆహ్వానం అందలేదన్న వ్యాఖ్యల వరకు చూస్తుంటే జూనియర్ టిడిపితో దాగుడు మూతలు ఆడుతున్నట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు.

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలకృష్ణ పైన తండ్రి కొడుకులు అసంతృప్తిగా ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఓ వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే తాము టిడిపికే అండగా ఉంటామని చెప్పడాన్ని టిడిపి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. పైకి జూనియర్ మద్దతు తమకుందని చెబుతున్నప్పటికీ.. ఇలా దాగుడుమూతల కంటే బాబు, బాలయ్యల పట్ల అంతగా అసంతృప్తిగా ఉంటే వెళ్తే వెళ్లొచ్చు కదా అని ఆఫ్ ది రికార్డ్‌గా చర్చించుకుంటున్నారట.

2009లో జూనియర్ పార్టీ కోసం జోరుగా ప్రచారం చేశారు. ఆ తర్వాతే పార్టీ, రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారని, నారా లోకేష్ పోటీకి రావడంతో జూనియర్‌లో మరింత కసి పెరిగిందంటున్నారు. ప్రచారం పేరుతో జూనియర్ గత ఎన్నికలలోనే తన అనుయాయులకు టిక్కెట్లు కూడా ఇప్పించుకున్నారు. లోకేష్ తెరపైకి రావడంతో ఇప్పుడు బాబుకు జూనియర్, హరికృష్ణ అనుకూల శత్రువులుగా మారారంటున్నారు.

రెండు రోజుల క్రితం తనకు ఆహ్వానం అందలేదని జూనియర్ చెప్పడం బాబు పైన తొడగొట్టడమే అంటున్నారు. నేరుగా కాకపోయినా పరోక్షంగా బాబుకు బాబాయ్‌కు సవాల్ చేసినట్లేనని చెబుతున్నారు. జూనియర్ దూకుడుకు హరికృష్ణ కూడా తోడు కావడం విశేషం. అయితే టిడిపిని పూర్తిగానే కాదని జూనియర్ భావిస్తే దమ్ము సినిమా అనుభవం కళ్ల ముందు కనిపిస్తోందని గుర్తు చేస్తున్నారు.

తొడగొట్టి సవాల్: ఎన్టీఆర్ దాగుడుమూతలు(పిక్చర్స్)

జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన చంద్రబాబును పరోక్షంగా సవాల్ చేసినట్లుగానే ఉందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.

తొడగొట్టి సవాల్: ఎన్టీఆర్ దాగుడుమూతలు(పిక్చర్స్)

2009 ఎన్నికలలో ప్రచారం చేసినప్పటి నుండే ఎన్టీఆర్‌కు రాజకీయాలపై గాలి మళ్లిందంటారు.

తొడగొట్టి సవాల్: ఎన్టీఆర్ దాగుడుమూతలు(పిక్చర్స్)

టిడిపి పగ్గాలపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, హరికృష్ణలు లోకేష్ ఆరంగేట్రంతో అసంతృప్తి కోవలో చేరిపోయారు.

తొడగొట్టి సవాల్: ఎన్టీఆర్ దాగుడుమూతలు(పిక్చర్స్)

బాబుకు తన బలం చూపించడానికి ఆయన కొడాలి నానిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పంపడంతో పాటు విజయవాడలో బలప్రదర్శన చేశారనేది వాదన.

తొడగొట్టి సవాల్: ఎన్టీఆర్ దాగుడుమూతలు(పిక్చర్స్)

తన దూకుడుకు తన తండ్రి హరికృష్ణ మద్దతు ఉండటంతో జూనియర్ మరింత రెచ్చిపోతున్నారంటున్నారు.

తొడగొట్టి సవాల్: ఎన్టీఆర్ దాగుడుమూతలు(పిక్చర్స్)

హరికృష్ణ రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాట్లాడుతూ.. విభేదాలు లేవని చెబుతూనే, ఇది వేదిక కాదని వ్యాఖ్యానించారు.

తొడగొట్టి సవాల్: ఎన్టీఆర్ దాగుడుమూతలు(పిక్చర్స్)

అంతకుముందే ఎన్టీఆర్.. మహానాడుకు వెళ్లక పోవడానికి కారణం పిలవక పోవడమేనని చెప్పారు. తద్వారా ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా బాబుతో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+