వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్‌ల్లో స్త్రీలకు ఆంక్షలా: రేప్‌లకు తాగుడే.. (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనూహ్యంగా ఆదివారంనాడు చాలా మంది నాయకులు మద్యం గురించే మాట్లాడారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిన మద్యం విక్రయాల వలనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు రాష్ట్ర మహిళ నాయకురాలు, సినీ నటి రోజా మండిపడ్డారు. పబ్‌ల్లో రాత్రి పూట మహిళలను అనుమతించాలని ఐఎసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. బెల్టు షాపులకు బదులు మరుగుదొడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. గ్రామాల్లో తాగడానికి మంచినీరు లేదు గానీ మద్యం మాత్రం దొరుకుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు.

రాష్ట్రంలో మంచినీటి కొరత ఉంది గానీ మద్యం కొరత లేదన్నారు. అంతే కాకుండా మద్యం విక్రయాలను రాష్ట్రం ఆదాయ ప్రధాన వనరుగా చేసిందని ఆమె ఆరోపించారు. మద్యం ధరలను ప్రభుత్వం పెంచినప్పుడు ధరలు తగ్గిం చమని ఆందోళన చేసిన చంద్రబాబు, నిషేదించమని ఎందుకు ఆందోళన చేయ లేదని ఆమె ప్రశ్నించారు. ఆమె గుంటూరు జిల్లా బాపట్లలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు

గ్రామాల్లో తాగటానికి నీరు లేదు గాని మద్యం మాత్రం ఏరులై ప్రవహిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మహిళ నగార బహిరంగ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో బెల్టుషాపులను రద్దుచేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

రాత్రి పది గంటలు దాటిన తర్వాత మహిళలను పబ్‌ల్లోకి ఎందుకు అనుమతించరని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ప్రశ్నించారు. మహిళలపై ఆ నిషేధం ఉన్నప్పుడు పురుషులకు కూడా అమలు చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో రోటరీ ఇంటర్నేషనల్ సౌత్ ఆసియా సదస్సులో ఆమె ఆదివారం ప్రసంగించారు. మహిళా మిత్రుల పట్ల నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరించాలని ప్రతి తల్లి తన పుత్రుడికి చెప్పాలని ఆమె అన్నారు.

పెళ్లికి ముందు గర్భవతి అయ్యే కూతుళ్ల కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించే తల్లులు తమ కుమారుల పట్ల ఎందుకు అలా వ్యవహరించరని ఆమె అన్నాడుర. యువతుల వస్త్రధారణపై విధించే ఆంక్షలను ఆమె తప్పు పట్టారు.

మద్యానికి బానిసలు కావడం వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. బెల్టు షాపులను మూసేయాలని ఆయన ఆదేశాలు ఇ్చచారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన స్వయం సహాయక గ్రూపులను ఉద్దేశించి ప్రసంగించారు. బెల్టు షాపులను మూసేసి మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. బెల్టు షాపులు వద్దని మహిళలు పెద్ద యెత్తున చెప్పగా, మరుగుదొడ్లు ఉన్నాయా అని మంత్రి వేసిన ప్రశ్నకు లేవని సమాధానం ఇచ్చారు. దశలవారీగా బెల్టు షాపులను మూసేస్తామని పక్కనే ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

పబ్‌ల్లో స్త్రీలకు ఆంక్షలా: రేప్‌లకు తాగుడే.. (పిక్చర్స్)

బెల్టు షాపులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

పబ్‌ల్లో స్త్రీలకు ఆంక్షలా: రేప్‌లకు తాగుడే.. (పిక్చర్స్)

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన మహిళా స్వయం సహాయక గ్రూపు సమావేశంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ బెల్టు షాపులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. బెల్టు షాపుల కన్నా మరుగుదొడ్ల నిర్మాణం ముఖ్యమని ఆయన చెప్పారు.

పబ్‌ల్లో స్త్రీలకు ఆంక్షలా: రేప్‌లకు తాగుడే.. (పిక్చర్స్)

మహిళలపై అత్యాచారాలకు తాగుడే కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజా అన్నారు. రాష్ట్రంలో మంచినీళ్లు దొరకడం లేదు గానీ మద్యం ఏరులై పారుతోందని ఆమె అన్నారు.

పబ్‌ల్లో స్త్రీలకు ఆంక్షలా: రేప్‌లకు తాగుడే.. (పిక్చర్స్)

మహిళా సాధికారితకు పబ్‌లను ప్రస్తావించారు ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి. పబ్‌ల్లోకి రాత్రి పది గంటల తర్వాత మహిళలను ఎందుకు అనుమతించడం లేదని ఆమె అడిగారు. మహిళలపై అటువంటి ఆంక్షలు పెట్టినప్పుడు పురుషులపై కూడా పెట్టాలని ఆమె అన్నారు. మహిళా సాధికారతకు పురుషులు తోడ్పాటు అందించాలని ఆమె సూచించారు.

English summary

 Why should there be a ban on women going to pubs after 10 pm and why can’t the ban be on men? Let the men sit at home and women go to pubs after 10 pm, suggested Rajya Sabha member and Congress spokesperson Renuka Chowdary in a blistering attack on current social mores and practices that unfairly target women and place no responsibility on men.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X