జగన్ బంధువుల కర్చీఫ్: ఇరకాటంలో నేతలు

YS Jagan - YS Vijayamma
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బంధువులు పలువురు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో కర్చీఫ్ వేసుకున్నారట. జగన్ కాంగ్రెసు పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీచి గెలిచింది. సాధారణ ఎన్నికలలోను జగన్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలు ఆ పార్టీలోకి వెళ్తున్నారు. అదే సమయంలో జగన్ బంధువులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్న పార్టీలోని ఇతర నేతలకు జగన్ బంధువులు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. టిక్కెట్ పైన నేతలు ఆశలు పెట్టుకోగా.. జగన్ బంధువులు పోటీ చేసేందుకు ఉవ్వీళ్లూరుతు వారు తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గంపై కన్నేస్తున్నారట.

దాదాపు పద్నాలుగు మంది జగన్ బంధువులు పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారట. ఇది జగన్ బంధువులు, నేతల మధ్య విభేదాలకు దారి తీస్తుందట. ఇటీవల రైల్వేకోడూరు నియోజకవర్గంలో జగన్ బంధువు కొండా రెడ్డికి, ఎమ్మెల్యే శ్రీనివాసులు మధ్య వాగ్వాదం జరిగింది. వైయస్ కొండా రెడ్డి, ఇతర బంధువులు కూడా ఎమ్మెల్యే అనుచరులతో వాగ్వాదానికి దిగారట. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోదరుడు రవీంద్రా రెడ్డి కమలాపురం నియోజకవర్గంపై ఇప్పటికే కన్నేశారు.

మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో పోటీకి వైయస్ కుటుంబంలోను పోటాపోటీ నెలకొందనే ప్రచారం ఇటీవల సాగిన విషయం తెలిసిందే. జగన్‌, విజయమ్మలతో పాటు షర్మిల, వైయస్ వివేకానంద రెడ్డి, రవీంద్రా రెడ్డి తదితరులు పోటీ కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+