ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా దొన‌కొండ‌, ముండ్ల‌మూరు, తాళ్లూరు మండ‌లాలు ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం లో చేరాయి. సీనియ‌ర్ నేత కాటూరి నారాయ‌ణ‌స్వామి ఇక్క‌డి నుండి ఒక‌సారి ..పొదిలి నుండి మూడు సార్లు గెలిచారు. టిడిపి లో మంత్రిగా ప‌ని చేసారు. 1984 లో మాజీ ముఖ్య‌మంత్రి కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డిని న‌ర్స‌రావు పేట స్థానం నుండి ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు. ద‌ర్శిలో ఒక‌సారి గెలిచిన వెంట‌క‌ర‌మ‌ణారెడ్డి , రాజ్‌గోపాల్ రెడ్డిలు తండ్రీ-కొడుకులు. 2004 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి పోటీ చేసిన బూచేప‌ల్లి సుబ్బారెడ్డి స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయ‌న త‌న యుడు శివ‌ప్ర‌సాద‌రెడ్డి 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి గెలిచారు. 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి రాజకీయ స‌మీక‌ర‌ణాల్లో మ‌ర్పులు క‌నిపించాయి.

15 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా..
ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం లో 1952 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ఎన్నిక‌లు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి అయిదు సార్లు, స్వ‌తంత్ర‌,సిపిఐ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. టిడిపి ఏర్పాట త‌రు వాత ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ ప్రాధాన్య‌త పెరిగింది. 1983 ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధి నారాయ‌ణ స్వామి గెలుపొందారు. అంతుకు ముందు నారాయ ణ స్వామి పొదిలి నియోజ‌క‌వ‌ర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 లో ఉప ఎన్నిక గెలిచిన టిడిపి ఆ త‌రు వాత తిరిగి 2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలిచింది. 2004 లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధి, 2009 లో కాంగ్రెస్ గెల‌వ‌గా..2014 ఎన్నిక‌ల్లొ టిడిపి నుండి గెలిచిన అభ్య‌ర్ధి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు.

#AndhraPradeshElections2019: All about Darsi Constituency

2014 లో టిడిపి అభ్య‌ర్ధి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 198875 ఓట్లు ఉండ‌గా, అందులో 181801 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన సిద్దా రాఘ‌వ‌రావుకు 88821 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన శివ‌ప్ర‌సాద‌రెడ్డికి 87447 ఓట్లు వ‌చ్చా యి. టిడిపి అభ్య‌ర్ధి సిద్దా రాఘ‌వ‌రావు 1374 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిద్దా రాఘ‌వ‌రావు టిడిపి పాలిట్ బ్యూరో స‌భ్యుడి గా ఉన్నారు. ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత మంత్రి ప‌ద‌వి ద‌క్కించు కున్నారు. ఇక‌, 2009 లో కాంగ్రెస్ నుండి గెలిచిన శివ‌ప్ర‌సాద‌రెడ్డి 2012 లో జ‌గ‌న్ తో క‌లిసారు. కాంగ్రెస్ పార్టీ అన‌ర్హ‌త వేటు వేయ‌టంతో వైసిపి లో చేరి 2014 లో ఆ పార్టీ నుండి పోటీ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+