ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గూడూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 లో నియెజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లో భాగంగా గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో కోట మండ‌లం..చిట్ట‌మూరు మండ‌లం రెండూ గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన గూడూరు నియోజ‌క‌వ‌ర్గం లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధి గా గెలుపొందిన న‌ల్ల‌పురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆ త‌రువాత వెంక‌ట‌గిరి..కొవ్వూరు ల‌లో నాలుగు సార్లు గెలిచి మంత్రి ప‌ద‌వి ని ద‌క్కించుకున్నారు. వ‌ర్గ పోరాటాలు ఎక్కువ‌గా ఉండే నెల్లూరు జిల్లాలో ఈ నియోజ‌క‌వ‌ర్గం లో స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌న‌బాక వ‌ర్గాన్ని ఓడించేందుకె నేదురుమ‌ల్లి వ‌ర్గం ప్ర‌య‌త్నించింద‌ని ప‌న‌బాక వ‌ర్గం చేసే ఆరోప‌ణ‌. ఇక‌, ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బ‌ల్లి దుర్గాప్ర‌సాద‌రావు మంత్రిగానూ ప‌ని చేసారు.

1952 నుండి.. 14 సార్లు..
గూడూరు నియోజ‌క‌వ‌ర్గం 1952 లో ఏర్పాటు అయింది. ఇక్క‌డి ఇప్పటి వ‌రకు మొత్తం 14 సార్లు ఎన్నిక‌లు జ‌రగ్గా.. అందు లో కాంగ్రెస్ ఆరు సార్లు.. టిడిని అయిదు సార్లు.. స్వ‌తంత్ర అభ్య‌ర్ధి రెండు సార్లు.. వైసిపి అభ్య‌ర్ధి ఒక్క‌సారి గెలుపొందారు.

 #AndhraPradeshElections2019: All about Gudur Constituency

2014 ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు..విజేత‌..
2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి వైసిపి అభ్య‌ర్దిగా పి సునీల్ కుమార్ పోటీ చేసారు. ఆ ఎన్నిక‌ల్లో మొత్తం గా 2 లక్షల 15 వేల 194 మంది ఉండ‌గా..అందులో ల‌క్షా 67 వేల 191 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన సునీల్ కుమార్ కు 80, 698 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్దికి జ్యోత్స్నల‌త కు 71,650 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ది సునీల్ కుమార్ 9048 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్య‌ర్ధిగా ప్ర‌య‌త్నించిన దుర్గా ప్ర‌సాద‌రావు టిక్కెట్ రాక‌పోవ‌టంతో రెబల్ గా పోటీకి దిగారు. అయితే, కేవ‌లం 348 ఓట్లు మాత్ర‌మే ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇదే నియోజ క‌వ‌ర్గం నుండి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మీ భ‌ర్త ప‌న‌బాక కృష్ణ‌య్య రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు.

టిడిపిలో కి ఫిరాయింపు..
వైసిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పి సునీల్ కుమార్ త‌రువాత టిడిపి లోకి ఫిరాయించారు. దీంతో..అక్క‌డ వైసిపికి కొత్త స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను నియ‌మించుకోవాల్సి వ‌చ్చింది. ఎమ్మెల్యేగా టిడిపిలోకి ఫిరాయించిన త‌రువాత నియోజ‌క‌ర్గ అభివృ ద్ది జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం చేసినా..ఆశించిన స్థాయిలో లేదు. ఇక‌, సునీల్ పార్టీ మారినా..కేడ‌ర్ చెక్కు చెద‌ర‌లేద‌ని వైసిపి నేత‌లు చెబుతూ ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+