ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కోడుమూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కర్నూలు మండలంలోని 12 గ్రామాలు వివిధ నియోజకవర్గాల్లో ఉండగా, పున ర్విభజన తరువాత కోడుమూరు (ఎస్సీ) నియోజకవర్గంలో చేరాయి. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సోదరుడి కుమారుడు దామోదరం మునిస్వామి కోడుమూరు లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.కోడుమూరు లో ఎమ్ శిఖామణి నాలుగు సార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే మణిగాంధీ టిడిపి నుండి పోటీ చేయగా ,ఆయన పై పి మురళీకృష్ణ గెలిచారు. అదే ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన ప్రజారాజ్యం అభ్యర్ది కరుణాకర్ రాజుకు 25 వేల ఓట్లకు పైగా సాధించారు. 2014 ఎన్నికల నాటికి కోడుమూరు లో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు జరిగాయి.
12 సార్లు ఎన్నికలు..కాంగ్రెస్ నుండే అధికంగా..
1962 నుండి ఇప్పటి వరకు కోడుమూరు లో 12 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఎనిమిది సార్లు, టిడిపి ఒక్కసారి, వైసిపి ఒక్కసారి, స్వతంత్ర పార్టీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్ధి ఒక్కసారి గెలుపొందారు. 1985 లో తొలిసారిగా టిడిపి నుండి ఎన్నికై న శిఖామణి 1989 లో టిడిపి నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1994 నుండి శిఖామణి కాంగ్రెస్ నుండి వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో గెలిచారు. 2009 లో కాంగ్రెస్ అభ్యర్ధిగా మురళీకృష్ణ గెలుపొందారు. అ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన మణిగాంధీ పై ఆయన 5325 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం 25 వేలకు పైగా ఓట్లు సాధించింది. కర్నూలు లోక్‌సభ పరిధిలో ఉండే కోడుమూరు నియోకవర్గంలో 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి బుట్టా రేణుక కు 29069 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇక, 2014 ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్ధులు - పార్టీలు మారిపోయాయి.

2014 లో వైసిపి గెలుపు.. పార్టీ ఫిరాయింపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 203954 మంది ఓటర్లు ఉండగా, 150915 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన మణిగాంధీ, 2014 లో వైసిపి లో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసారు. టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా ఈ సీటు బిజెపి కి దక్కింది. బిజెపి అభ్యర్ధిగా ఎమ్ రేణుకమ్మ పోటీ చేసారు. వైసిపి అభ్యర్ధి మణి గాంధీకి 84206 ఓట్లు రాగా, రేణుకమ్మ కు 31822 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి 52384 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు. ఎన్నికల తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన మణిగాంధీ టిడిపిలోకి ఫిరాయించారు. ఇక, 2009 లో కాంగ్రెస్ అభ్య ర్ధిగా పోటీ చేసిన మురళీకృష్ణ వైసిపి లో చేరారు.












Click it and Unblock the Notifications