ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కర్నూలు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా..ఈ నియోజ‌క‌వర్గం ప‌రిధిలోని 12 గ్రామాల్లో 9 గ్రామాలు కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లాయి. కాగా, క‌ర్నూలు మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోని 1 నుండి 69 వార్దుల తో క‌ర్నూలు నియో జ‌క‌వ‌ర్గం కొన‌సాగుతోంది. ఇక్క‌డ నుండి ఎమ్ముల్యేగా గెలిచిన దామోద‌రం సంజీవ‌య్య ఏపి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసారు. ఏఐసిసి అధ్య‌క్షుడిగానూ వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి కెఇ కృష్ణ‌మూర్తి తండ్రి కెఇ మాద‌న్న ఇక్క‌డి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. క‌ర్నూలు లో న‌లుగురు మైనార్టీ నేత‌లు గెలిచారు. ప్ర‌స్తుత రాజ్య స‌భ ఎంపి టిజి వెంక‌టేష్ టిడిపి నుండి ఒక సారి గెలిచి..రెండు సార్లు ఓడిపోయారు. 2009 లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా ఎన్నిక‌యి..కిర‌ణ్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. 2014 నాటికి ఇక్క‌డి ప‌రిస్థితులు మారిపోయాయి.

14 సార్లు ఎన్నిక‌లు.. ప్ర‌ముఖుల గెలుపు..
క‌ర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఎనిమిది సార్లు, టిడిపి రెండు సార్లు, సీపీయం రెండు సార్లు, వైసిపి ఒక సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్ధి ఒక సారి గెలిచారు. రాంభూపాల్ చౌద‌రి ఇక్క‌డి నుండి టిడిపి ఎమ్మెల్యేగా ఒక‌సారి, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొంది మంత్రిగా ప‌ని చేసారు. ఇక‌, రాయ‌ల‌సీమ హ‌క్కుల వేదిక పేరుతో టిజి వెంక‌టేష్ సీమ ప్రాంత స‌మ‌స్య‌ల పై గ‌ళం ఎత్తేవారు. దీంతో..2009 లో ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌కు కిర‌ణ్ కుమార్ రెడ్డి మంత్రి వ‌ర్గంలో స్థానం ద‌క్కింది. ఆ త‌రువాత 2014 నాటికి ఆయ‌న కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరి..క‌ర్నూలు అభ్య‌ర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం అయిన ఎస్వీ మోహ‌న రెడ్డి కుమారుడు ఎస్వీ మోహ‌న‌రెడ్డి.

#AndhraPradeshElections2019: All about Kurnool Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు.. పార్టీలు మారిన నేత‌లు..
2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన టిజి వెంక‌టేష్ 2014 ఎన్నిక‌ల ముందు టిడిపిలో చేరారు. ఎస్వీ కుటుంబం వైసిపి లో చేర‌టం తో ఎస్వీ మోహ‌న‌రెడ్డికి క‌ర్నూలు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. గ‌తంలో ఆయ‌న ఎమ్మెల్సీగా ప‌ని చేసారు. 2014 ఎన్నిక‌ల ముందు వైసిపి లో చేరి బ‌రిలో నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో మొత్తం 245672 ఓట్లు ఉండ‌గా.. అందు లో 143517 ఓట్లు పోల‌య్యాయి. అందులో వైసిపి అభ్య‌ర్ధి మోహ‌న‌రెడ్డికి 57962 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన టిజి వెంక‌టేష్ కు 54483 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ధి 3479 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ త‌రువాత మోహ‌న‌రెడ్డి సోద‌రి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించ‌టం..బావ భూమా నాగిరెడ్డి- మేన కోడ‌లు అఖిల‌ప్రియ టిడిపిలోకి చేర‌టంతో..మోహ‌న‌రెడ్డి సైతం టిడిపిలో కి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+