ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మచిలీపట్నం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గతంలో ఉన్న బందరు నియోజకవర్గాన్ని మచిలీపట్నం గా మార్చారు. ఇక్కడ నుండి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచిన పేర్ని నాని కృష్ణమూర్తి కూడా ఒకసారి గెలిచారు. వడ్డి రంగారావు మూడు సార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన అంబటి బ్రాహ్మణయ్య 2009 లో అవనిగడ్డలో గెలుపొందారు. ఆయన ఒక సారి ఎంపీగానూ గెలిచారు. పెదసింగు లక్ష్మణరావు మూడు సార్లు విజయం సాధించారు. ఇక్కడ గెలిచిన వారిలో వడ్డి రంగారావు గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో పని చేసారు. కృష్ణమూర్తి అప్పట్లో నేదురుమల్లి క్యాబినెట్‌లో ఉన్నారు. 1999 లో ఎన్నికైన నరసింహారావు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు.
16 సార్లు ఎన్నికలు..
మచిలీపట్నం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి ఆరు సార్లు, సిపిఐ, జనతా, స్వతంత్ర అభ్యర్ది ఒక్కోసారి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి పేర్ని వెంకట్రామయ్య రెండో సారి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టిడిపి నుండి కొల్లు రవీంద్ర పోటీ చేసారు. ప్రజారాజ్యం నుండి మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ పోటో చేసారు. 2009 లో టిడిపి నుండి పోటీ చేసిన కొల్లు రవీంద్ర తిరిగి 2014 లో బరిలో నిలిచారు. 2014 లో పెడన నుండి పోటీ చేసిన బూరగడ్డ వేదవ్యాస్ ప్రస్తుతం టిడిపిలో ఉన్నారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 182288 ఓట్లు ఉంటే, అందులో 139948 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన కొల్లు రవీంద్ర కు 75269 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన పేర్ని నానికి 59408 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది కొల్లు రవీంద్ర 15806 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గెలిచిన కొల్లు రవీంద్ర చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కొనసా గుతున్నారు.












Click it and Unblock the Notifications