ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఎస్సీ రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గంగా నందికొట్కూరు రూపాంతరం చెం దింది. ఆత్మ‌కూరు నిమోజ‌క‌వ‌ర్గం నుండి పాముల‌పాడు, కొత్త‌ప‌ల్లె మండ‌లాలు నందికొట్కూరు నియోజ‌క‌వర్గంలో చేరాయి. గ‌తంలో బైరెడ్డి కుటుంబానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం పెట్ట‌ని కోటగా ఉండేది. భైరెడ్డి శేష‌శ‌య‌నా రెడ్డి, రాజ‌శేఖ‌ర రెడ్డి తండ్రీ - కొడుకులు. 2009 ఎన్నిక‌ల వ‌ర‌కు ఇక్క‌డ ఒక వ‌ర్గం హ‌వా కొన‌సాగింది. ప్ర‌ముఖ న‌క్సల్ నాయ‌కుడు చండ్ర పుల్లారెడ్డి 1952 లో ఇక్క‌డి నుండి సిపిఐ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ నియోజ‌క‌వర్గంగా మ‌రిన త‌రు వాత ఇక్క‌డి నుండి తొలిసారిగా కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ల‌బ్బి వెంక‌ట‌స్వామి గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల నాటి కి ఇక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి.

14 సార్లు ఎన్నిక‌లు..ప్ర‌ముఖుల గెలుపు..
ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి మూడు సార్లు, స్వ‌తంత్రు లు..రెండు సార్లు, సిపిఐ ఒక‌సారి, వైసిపి ఒక సారి గెలుపొందాయి. బైరెడ్డి కుటుంబీకులు ఇక్కడి నుండి అయిదు సార్లు గెల‌వ‌గా..రెండు సార్లు ఓడిపోయారు. బైరెడ్డి శేష‌శ‌య‌న రెడ్డి మంత్రిగా ప‌ని చేసారు. ప్ర‌స్తుతం పాణ్యం నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చ‌రిత 2004 లో టిడిపి నుండి పోటీ చేసిన బైరెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి మీద గెలుపొందారు. ఒక‌, 2009 లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన అభ్య‌ర్ది రేణుక‌మ్మ‌కి ఇక్క‌డ 11968 ఓట్లు ద‌క్కాయి.నంద్యాల లోక్‌స‌భ ప‌రిధిలో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఉంది.

#AndhraPradeshElections2019: All about Nandikotkur Constituency

2014 లో వైసిపి గెలుపు..
ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల్లో మొత్తం 203531 ఓట్లు ఉండ‌గా, అందులో 159025 ఓట్లు పోల‌య్యాయి. కాగా, వైసిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసిన ఐజయ్య కు 87496 ఓట్లు రాగా, ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరి టిడిపి నుండి పోటీ చేసిన ల‌బ్బి వెంక‌ట‌స్వామి కి 65682 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ధి ఐజ‌య్య 21814 ఓట్ల మెజార్గీతో గెలుపొందారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల త‌రువాత ఇక్క‌డ అధిప‌త్యం కోసం రెండు ప్ర‌ధాన పార్టీలు పోటీ ప‌డుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+