ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం లో నంద్యాల టౌన్, నంద్యాల రూర‌ల్ తో పాటుగా గోస్పాడు మండ‌లం చేరింది. ప్ర‌స్తుత శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ ఎన్ఎండి ఫ‌రూక్ మూడు సార్లు ఎన్నిక‌య్యారు. మాజీ మంత్రి శిల్పా మోహ‌న‌రెడ్డి కాంగ్రెస్ నుండి ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి రెండు సార్లు గెలిచారు. నంద్యాల నియోజ‌క వ‌ర్గంలో ఆంధ్రా ప్రాంతం నుండి వ‌చ్చిన సెటిల‌ర్లు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్య నువ్వా నేనా అన్న‌ట్లు గా ఇక్కడ ప్ర‌తీ సారి ఎన్నిక జ‌రుగుతంది. వ‌ర్గ పోరు ఎక్కువ‌గా ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గం లో భూమా - శిల్ప వ‌ర్గాల మ‌ధ్య రాజ‌కీయ ఆధిప‌త్య పోరు సాగుతూ ఉండేది. అయితే, 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి ఎమ్మెల్యేగా గెలిచి కొద్ది కాలం క్రితం భూమా నాగిరెడ్డి మ‌ర‌ణించారు. దీంతో..అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక మొత్తం స‌మీక‌ర‌ణాల‌నే మార్చేసింది.

15 సార్లు ఎన్నిక‌లు..
నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి 1952 నుండి ఇప్ప‌టి వ‌రకు మొత్తం 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్ అయి దు సార్లు, టిడిపి నాలుగు సార్లు, జ‌న‌తా పార్టీ ఒక‌సారి, స్వ‌తంత్రులు నాలుగు సార్లు, వైసిపి ఒక‌సారి ఎన్నిక‌య్యారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు సార్లు గెలిచిన ఫ‌రూక్ గ‌తంలో ఎన్టీఆర్ -చంద్ర‌బాబు క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన శిల్పా మోహ‌న రెడ్డి వైయ‌స్‌..రోశ‌య్య ప్ర‌భుత్వంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవ్వ‌గానే శిల్పా ను మంత్రి ప‌ద‌వి నుండి తొలిగించారు. దీంతో..2014 ఎన్నిక‌ల ముందు శిల్పా సోద‌రులు ఇద్ద‌రూ టిడిపిలో చేరారు. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జారాజ్యంలో ఉన్న భూమా దంప‌తులు వైసిపి లో చేరారు. దీంతో..పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

#AndhraPradeshElections2019: All about Nandyal Constituency

2014 లో వైసిపి అభ్య‌ర్ధి..ఉప ఎన్నిక‌లో టిడిపి గెలుపు..
2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అప్పుడే టిడిపి లో చేరిన శిల్పా మోహ‌న‌రెడ్డి ఆ పార్టీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగారు. వైసిపి నుండి భూమా నాగిరెడ్డి పోటీ చేసారు. ఆ ఎన్నిక‌ల్లో మొత్తం 242742 ఓటర్లు ఉండ‌గా, అందులో 174309 మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అందులో వైసిపి అభ్య‌ర్ధి భూమా నాగిరెడ్డికి 82194 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్ధి 78590 ఓట్లు ద‌క్కా యి. వైసిపి అభ్య‌ర్ధి భూమా నాగిరెడ్డి 3604 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక‌, ఆ త‌రువాత భూమా సైతం టిడిపిలో చేర టంతో శిల్పా సోద‌రులు వైసిపి లోకి వెళ్లారు. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో గ‌త ఏడాది అక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగింది. టిడి పి నుండి భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్ర‌హ్మానంద‌రెడ్డి బ‌రిలో నిల‌వ‌గా..వైసిపి నుండి శిల్పా మోహ‌న్ రెడ్డి పోటీ చేసారు. ఆ ఎన్నిక వైసిప - టిడిపి రెండు పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. ఆ ఉప ఎన్నిక‌లో టిడిపి అభ్య‌ర్ధి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+