ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
నెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రం నెల్లూరు సిటీ. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకూ నెల్లూరు-రాపూరు గా ఉన్న ఈ నియోజక వర్గం అప్పటి నుండి నెల్లూరు సిటీ..నెల్లూరు రూరల్ గా కొత్త నియోజవర్గాలు గా ఏర్పడ్డాయి. ఆనం కుటుంబీ కు లకు పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గం లో తొలి నుండి వారిదే ఆధిపత్యం. 2009 లో నెల్లూరు కార్పోరేషన్ కు చెందిన పలు డివిజన్లు ఈ నియోజకవర్గంలో చేరాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలి సారిగా 2009 లో ప్రజా రాజ్యం నుండి పోటీ చేసిన శ్రీధర కృష్ణారెడ్డి గెలుపొందారు. అప్పుడు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ది అని ల్ కుమార్ 2014 లో వైసిసి నుండి ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. నెల్లూరు జిల్లా రాజకీయాలకు ముఖ్య కేంద్రంగా ఇదే నియోజకవర్గం కీలకంగా వ్యవహరిస్తోంది.
14 సార్లు ఎన్నికలు..
నెల్లూరు నియోజకవర్గం 1952 లో ఏర్పాటైంది. అప్పటి నుండి 2014 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సార్లు గెలుపొందింది, కాగా, భారతీయ జనసంఘ్ ఒక్క సారి, టిడిపి రెండు సార్లు గెలిచాయి. స్వతంత్రులు రెండు సార్లు గెలిచారు. ఇక.. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్ది గెలవగా.. 2014 ఎన్ని కల్లో వైసిపి అభ్యర్ది గెలిచారు. ఇదే నియోజకవర్గం నుండి గెలిచిన ఆనం కుటుంబీకులు అయిదుగురు ఎమ్మెల్యేలు గా గెలిచి అందులో నలుగురు మంత్రులుగా పని చేసారు.ఆనం కుటుంబం నుండి ఆనం వెంకటరెడ్డి. ఇద్దరు కుమారులు రామనారాయణ రెడ్డి, వివేకానందరెడ్డిలు మంత్రులుగా చేసారు.
సిటీ లో 2.50 లక్షల ఓట్లు..
నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం లో 2014 ఎన్నికల లెక్కల ప్రకారం దాదాపు గా రెండు లక్షల 44 వేల 882 ఓట్లు ఉన్నాయి. అందులో లక్షా 39 వేల 669 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసిపి నుండి పోటీ చేసిన అనిల్ కుమార్ యాద వ్ కు 74,372 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ది శ్రీధర్ కృష్ణారెడ్డికి 55,285 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్
19087 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.

2014 లో అనూహ్య ఫలితాలు..
2014 ఎన్నికల్లో ప్రధానంగా పోటీ లో నిలిచిన ఇద్దరు అభ్యర్దులు 2009 లో పోటీ పడిన వారే. అయితే, పోటీ చేసిన పార్టీలే మారాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన కృష్ణారెడ్డి ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన టిడిపిలో చేరి..నెల్లూరు సిటీ టిక్కెట్ దక్కిం చుకున్నారు. ఇక, 2009 లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి శ్రీధరకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్దిగా పోటీ చేసి..వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఇక, కాంగ్రెస్, సమై క్యాంధ్ర పార్టీల నుండి పోటీ చేసిన అభ్యర్దులు డిపాజిట్లు కోల్పోయారు.
ఫైర్ ఎమ్మెల్యేగా అనిల్..
వైసిపి ఎమ్మెల్యేగా అనిల్ గెలిచినప్పటి నుండి అసెంబ్లీ లోపలా ..బయటా వైసిపి వాయిస్ బలంగా వినిపిస్తూ..టిడిపిని కాన్నర్ చేయటం లో ముందు నిలుస్తున్నారు. నియోజకవర్గం లో ప్రజా సమస్యల పై ఎప్పుడూ ప్రభుత్వాన్ని..అధికారు లను నిలదీయటం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇక నెల్లూరు కార్పోరేషన్ లో సైతం అనిల్ వాయిస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా నిలదీయటం తో అనిల్ కు ప్రజల్లో ఇమేజ్ దక్కింది.












Click it and Unblock the Notifications