ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాడేరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాడేరు మండలం మొత్తం ఇదే నియోజకవర్గంలో చేరింది. ఇక్కడ నుండి ఇక్కడ టిడిపి - కాంగ్రెస్ నుండి గెలిచి మంత్రులుగా పని చేసారు. 2004 లో చింతపల్లి నుండి పోటీ చేసి దేముడు 2009 లో కాంగ్రెస్ అభ్యర్ది పి బాలరాజు చేతిలో ఓడిపోయారు. బాలరాజు వైయస్, రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా పని చే సారు. 1989 లో గెలిచిన ఎం బాలరాజు అప్పట్లో నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్‌లో మంత్రిగా వ్యవహరించారు. 1999 లో టిడిపి నుండి గెలిచిన మణికుమారి సైతం చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఇక్కడ బిఎస్పీ నుండి పోటీ చేసిన రాజారావు గెలుపొందారు. 2009 ఎన్నికల తరువాత ఇక్కడ పోరు టిడిపి - వైసిపి మధ్య సాగింది. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కాంగ్రెస్ అభ్యర్దుల మీద ప్రభావం చూపించింది.
11 సార్లు ఎన్నికలు జరిగితే..
పాడేరు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో అయిదు సార్లు కాంగ్రెస్ గెలిచింది. మూడు సార్లు టిడిపి గెలవగా, బిఎస్పీ ఒకసారి గెలుపొందింది. మరోసారి జనతా పార్టీ గెలిచింది. కాగా, ఒకసారి వైసిపి నెగ్గింది. ఇక, 2009 ఎన్నికల్లో ఇక్కడ నుండి గెలిచిన మంత్రి బాలరాజు 2014 లోనూ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు
2014 ఎన్నికల్లో మొత్తంగా ఇక్కడ 217396 ఓట్లు ఉంటే, అందులో 129621 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన ఈశ్వరి కి 52384 ఓట్లు రాగా, సిపిఐ నుండి దేముడు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచి 26243 ఓట్లు సాధించారు. వైసిపి అభ్యర్ది ఈశ్వరి 26141 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. టిడిపి- బిజెపి పొత్తులో భాగంగా ఇక్కడి నుండి పోటీ చేసిన ఎల్ గాంధీకి 17029 ఓట్లు వచ్చాయి. వైసిపి నుండి గెలిచిన ఈశ్వరి ఆ తరువాత టిడిపిలోకి ఫిరాయించారు.












Click it and Unblock the Notifications