ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాణ్యం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. ఓర్వకల్లు..కల్లూరు మండలాలు పూర్తిగా పాణ్యం నియోజకవర్గంలో చేరా యి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇక్కడి నుండి జరిగిన ఉప ఎన్నికల్లోనే పోటీ చేసి ముఖ్య మంత్రి పీఠం అధిరోహించారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా రేణుకా చౌదరి పోటీ చేసారు. ఇక్కడ కాటసాని కుటుంబం ఎంతో కాలంగా పట్టు సాధించింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి అయిదు సార్లు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏరాసు అయ్యప్పరెడ్డి రెండు సార్లు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో సోదరులైన కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం నుండి..కాటసాని రామిరెడ్డి పీఆర్పీ అభ్యర్ధిగా బనగానపల్లె నుండి గెలుపొందారు. ఇక, 2014 ఎన్నికల నాటికి పాణ్యం నియోజకవర్గంలో పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారి పోయాయి. ఇప్పుడు తిరిగి ఎన్నిక ల సమయానికి కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
12 సార్లు ఎన్నికలు.. కాటసాని దే అధిక్యం..
పాణ్యం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుండి ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపొందారు. టిడిపి నుండి రెండు సార్లు గెలిచారు. జనతా పార్టీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్ధి ఒకసారి, వైసిపి నుండి ఒకసారి గెలిచారు. 1985 నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి వరుసగా గెలుస్తూ వచ్చారు. 1993 లో ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కోసం తన పదవికి రాజీనామా చేసారు. కాటసాని రాజకీయ ప్రత్యర్ధి బి పార్ధసారధి రెడ్డి టిడిపి నుండి ఒక సారి గెలిచి.. మరోసారి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసిన విష్ణువర్దన్ రెడ్డి 28600 ఓట్లు దక్కించుకున్నారు. నందికొట్కూరు కు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ నియోజకవర్గం రిజర్వ్ కావటంతో ఇక్కడి నుండి 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

2014 ఎన్నికలు..వైసిపి గెలుపు..
ఇక, రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో ఇక్కడి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నందికొట్కూరు లో ఒక సారి విజయం సాధించిన గౌరు చరిత 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా ఇక్కడి నుండి పోటీ చేసారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న కాటసారి రాంభూపాల్ రెడ్డి ఆ పార్టీ నుండి కాకుండా సోషలిస్ట్ డెమోక్రటిక్ నేషనల్ పార్టీ ఆఫ్ ఇండి యా పార్టీ నుండి బరిలోకి దిగారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉండి ఎన్నికల ముందు టిడిపిలో చేరిన ఏరాసు ప్రతాప రెడ్డి టిడిపి అభ్యర్ధిగా ఇక్కడ పోటీలో నిలిచారు. మొత్తం నియోకవర్గంలో 280641 ఓట్లు ఉండగా, అందులో 200741 ఓట్లు పోలయ్యాయి. వైసిపి అభ్యర్ధి గౌరు చరిత కు 72245 ఓట్లు రాగా, కాటసాని రాం భూపాల్ రెడ్డికి 60598 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గౌరు చరిత 11647 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications