ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పర్చూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో యుద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగం జాం, మార్టూరు మండలాలు పూర్తిగా పర్చూరు సెగ్మెంట్ లో చేరాయి. ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇక్క డి నుండి నాలుగు సార్లు. మార్టూరు నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ చీలక తరువాత జరిగిన పరిణామాల్లో కొంత కాలం వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. దగ్గుబాటి గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. దగ్గుబాటి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య ను ఓడించారు. గతంలో సీనియర్ నేత గాదె వెంకటరెడ్డిని రెండు సార్లు ఓడించారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన దగ్గుబాటి 2004 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి చెంచు గరటయ్య మీద గెలుపొందారు. ఇక, 2014 ఎన్నికల నాటికి రాజకీయంగా పరిణామాలు మారిపోయాయి. ఇప్పటికీ సమీకరణాల్లో మార్పులు జరిగాయి.
14 సార్లు ఎన్నికలు
పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి అయిదు సార్లు, సిపిఐ ఒకసారి, స్వతంత్ర అభ్యర్ధి ఒక సారి గెలిచారు. ఇక్కడ నుండి కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి మూడు సార్లు గెలిచారు. బాపట్ల నుండి రెండు సార్లు గెలుపొందారు. ఆయన వైయస్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన టిడిపిలో చేరారు. 1999 లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్ధిగా గెలిచిన జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసారు.

2014 లో టిడిపి గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో పర్చూరు లో మొత్తం 214892 మంది ఓటర్లు ఉండగా, అందులో 188280 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ఏలూరు సాంబశివరావుకు 97248 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన గొట్టిపాటి భరత్ కు 86478 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి సాంబశివరావు 10775 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి నుండి పోటీ చేసిన భరత్ గొట్టిపాటి నరసయ్య కుమారుడు. టిడిపి నుండి గెలిచిన సాంబశివరావు తొలి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక, ఇక్కడ ప్రత్యేక గుర్తింపు ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసిపి లో చేరాలని నిర్ణయించారు. దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో ఉన్నారు. వారి తనయుడు హితేష్ చెంచురామ్ వైసిపి లో చేరుతున్నారు.












Click it and Unblock the Notifications