ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లో భాగంగా.. పాణ్యం సెగ్మెంట్ నుండి వెల్దుర్తి, డోన్ సెగ్మెంట్ నుండి క్రిష్ట‌గిరి మండ‌లాలు ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిసాయి. తుగ్గిలి మండలం పూర్తిగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరింది. ఇక‌, ప‌త్తి కొండ నియోజ‌క‌వ‌ర్గంలో కెఇ కుటుంబం..ఎస్వీ సుబ్బారెడ్డి అనేక ప‌ర్యాయాలు గెలుస్తూ వ‌చ్చింది. డోన్‌- ఆళ్ల‌గ‌డ్డ‌-ప‌త్తి కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో కెఇ కుటుంబం త‌న ఆధిప‌త్యాన్ని నిరూపించుకుంటూ వ‌స్తోంది. ఎస్ వి సుబ్బారెడ్డి ప‌త్తికొండ నుండి మూడు సార్లు..ఆళ్ల‌గ‌డ్డ నుండి రెండు సార్లు గెలిచి టిడిపి ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు. ఆయ‌న కుమార్తె, కుమారుడు,అల్లుడు ముగ్గురూ క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించారు. 2014 ఎన్నిక‌ల నాటికి కెఇ కుటుం బం తో పాటుగా ఎస్వీ మోహ‌న రెడ్డి కుటుంబ రాజ‌కీయాల్లో మార్పు వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో ప‌త్తికొండ నుండి పోటీ చేసి గెలిచిన కెఇ కృష్ణ‌మూర్తి ప్ర‌స్తుతం ఏపి ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.

15 సార్లు ఎన్నిక‌లు..టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్యే పోటీ..
ప‌త్తికొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో ఆరు సార్లు కాంగ్రెస్‌, ఏడు సార్లు టిడిపి, సిపిఎం ఒక‌సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్ధి ఒక‌సారి గెలుపొందారు. కెఇ ప్ర‌భాక‌ర్ డోన్ నుండి రెండు సార్లు గెల‌వ‌గా, 2009 ఎన్నిక‌ల్లో ప‌త్తికొండ నుండి గెలిచారు. 2009 లో ఎస్వీ మోహ‌న‌రెడ్డి కుమారుడు ప్ర‌స్తుత క‌ర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న‌రెడ్డి పై విజ‌యం సాధించారు. ఇక్క‌డ 2009 లో పోటీ చేసిన ప్ర‌జారాజ్యం కేవ‌లం 5176 ఓట్లు మాత్ర‌మే ద‌క్కిం చుకుంది. 2009 లో ఇక్క‌డి నుండి స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా పోటీ చేసిన నీరజా రెడ్డి2009 లో ఆలూరు లోకాంగ్రెస్ అభ్య‌ర్దిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి అభ్య‌ర్ధుల పార్టీలు మారిపోయాయి.

#AndhraPradeshElections2019: All about Pattikonda Constituency

2014 లో టిడిపి గెలుపు..కెఇ కి మరో విజ‌యం..
2014 లో ప‌త్తికొండ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 199011 ఓట్ల‌కు గాను, 156376 ఓట్లు పోల‌య్యాయి. అందులో టిడిపి నుండి పోటీ చేసిన కెఇ కృష్ణ‌మూర్తికి 62706 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన హ‌రి చ‌క్ర‌పాణి రెడ్డికి 55067 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసిన కెఇ కృష్ణ‌మూర్తి 7639 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన త‌రువాత టిడిపి ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు తో స‌మ‌కాలీకుడైన కెఇ కృష్ణ‌మూర్తికి ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఆయ‌న బిసి కోటాలో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అదే విధంగా సోద‌రుదు కెఇ ప్ర‌భాక‌ర్ కు నామినేటెడ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. క‌ర్నూలు జిల్లాలో కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి కుటుంబం తో రాజ‌కీయంగా పోటీ ప‌డే కెఇ కుటుంబం మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతూనే ఉంది. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత 2014 నుండి ఇక్క‌డి ప‌రిస్థితుల్లో స‌మీక‌ర‌ణాలు మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+