ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా గూడూరు, పెడ‌న‌, బంటుమిల్లి మండ‌లాలు పూర్తిగా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం లో విలీన‌మ‌య్యాయి. మ‌ల్లేశ్వ‌రం 2009 లో ర‌ద్దు అవ్వ‌టం..పెడ‌న ఏర్పాటు కావ‌టం జ‌రిగింది. మ‌ల్లేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుండి టిడిపి సీనియ‌ర్ నేత కాగిత వెంక‌ట్రావు మూడు సార్లు గెల‌వ‌గా..రెండు సార్లు ఓడిపోయారు. పెడ‌న నుండి ఒక‌సారి ఓడిన కాగిత వెంక‌ట్రావు మ‌రోసారి గెలిచారు. అదే విధంగా కాంగ్రెస్ నేత బూర‌గ‌డ్డ వేదవ్యాస్ సైతం ఇక్క‌డి నుండి రెండు సార్లు గెలుపొందారు. 1983 లో ఇక్క‌డి నుండి గెలిచిన అంకెం ప్ర‌భాక‌ర రావు ఎన్టీఆర్ ప్ర‌భుత్వం లో మంత్రిగా ప‌ని చేసారు . 2009 వ‌ర‌కు కాంగ్రెస్ లోనే ఉన్న వేద‌వ్యాస్ ఆ త‌రువాత ప్ర‌జారాజ్యం లో చేరి బంద‌రు నుండి పోటీ చేసారు. 2009 లో పెడ‌న నుండి కాంగ్రెస్ అభ్య‌ర్దిగా గెలిచిన జోగి ర‌మేష్ ఆ త‌రువాత వైసిపి లో చేరారు.

13 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
మ‌ల్లేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో 11 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా..అందులో నాలుగు సార్లు కాంగ్రెస్‌, నాలుగు సార్లు టిడిపి, జ‌నతా ఒక సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్ది ఒక‌సారి గెలిచారు. అదే విధంగా 2009 లో ఏర్పాటైన పెడ‌న నుండి రెండు సార్లు ఎన్నిక‌లు జ రిగాయి. 2009 లో కాంగ్రెస్ గెల‌వ‌గా..2014 లో టిడిపి గెలిచింది. జోగి ర‌మేష్ ఇబ్ర‌హీంప‌ట్నం ప్రాంతానికి చెందిన వారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ ను వీడ‌టంతో..జోగి ర‌మేష్ కు కాంగ్రెస్ టిక్కెట్ ద‌క్కింది. 2009 లో గెలిచిన ఆయ‌న ఆత‌రువాత జ‌రిగిన రాజ‌కీయా ప‌రిణామాల్లో అన‌ర్హ‌త వేటు ప‌డి వైసిపి లో చేరారు. 2014 లో వైసిపి అభ్య‌ర్ధి గా మైల‌వ‌రం నుండి పోటీ చేసారు.

AndhraPradeshElections2019: All about Pedana Constituency

2014 లో టిడిపి గెలుపు..

2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తంగా 156843 ఓట్లు ఉండ‌గా, అందులో134613 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన కాగిత వెంక‌ట్రావుకు 71779 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ కు 58086 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి నుండి పోటీ లో ఉన్న కాగిత వెంక‌ట్రావు 13694 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+