ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజమండ్రి సిటీ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజమండ్రిగా ఉన్న సెగ్మెంట్ ను పూర్తిగా నగర ప్రాంతంతో రాజమం డ్రి సిటీగా ఏర్పాటు చేసారు. టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడి నుండి నాలుగు సార్లు గెలిచారు. ఇదే నియోజకవర్గం నుండి మూడు సార్లు ఓడిపోయారు. ఇక్కడ ప్రజారాజ్యం సైతం 2009 లో కాంగ్రెస్- టిడిపితో దాదాపు సరి సమానంగా ఓట్లను సంపాదించిది. మూడు పార్టీల మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉంది. ఇక, గోరంట్ల బుచ్చయ్య చౌదని ఎన్టీఆర్ క్యాబినెట్ లో పని చేసారు. టిడిపి చీలక సమయంలో ఎన్టీఆర్ తో ఉన్నారు. ఆయన మరణం తరువాత తిరిగి చంద్రబాబు తో కలిసారు. ఇక, 2009 లో డీలిమిటేషన్ తరువాత జరిగిన ఎన్నికల్లో 2004 లో కాంగ్రెస్ నుండి గెలిచిన రౌతు సూర్యప్రకాశరావు తిరిగి 2009లోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద గెలుపొందారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
రాజమండ్రి నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు గెలవగా, టిడిపి నాలుగు సార్లు గెలిచింది. రెండు సార్లు సిపిఐ, ఒక సారి ప్రజాపార్టీ గెలుపొందాయి. ఒక సారి బిజెపి గెలిచింది. 2009 ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో రెండు సార్లు గెలిచిన సూర్యప్రకాశ రావు వైసిపి లో చేరారు. రాజమండ్రి ఎంపీగా వ్యవహరించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇక్కడ 1994, 1999 లో ఇక్కడ నుండి బుచ్చయ్య చౌదరి పై పోటీ చేసి ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా ఈ సీటు బిజెపికి కేటాయించారు.

2014 ఎన్నికల్లో బిజెపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 229746 ఓట్లు ఉండగా, అందులో 157195 ఓట్లు పోలయ్యాయి. బిజెపి నుండి ఆకుల సత్య నారయణ కు 79531 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన బొమ్మన రాజకుమార్ కు 53154 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ది ఆకుల సత్యనా రాయణ 26377 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 లో ఇక్కడ బిజెపి ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల సత్య నారాయణ కొద్ది రోజుల క్రితం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేన లో చేరారు.












Click it and Unblock the Notifications