ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సంతనూతలపాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి మండలాలు సంతనూత ల పాడు అసెంబ్లీ నియోజకవర్గంలో చేరాయి. అంతకు ముందు ఉన్న అమ్మనబ్రోలు నియోజకవర్గం లో తొలి ఎమ్మెల్యే గా జాగర్లమూడి చంద్రమౌళి ఒకసారి, సిపిఐ నుండి సింగయ్య గెలిచారు. ఇక, సంతనూతల పాడు నుండి ఆరేటి కోటయ్య, టి చెంచయ్య లు రెండేసి సార్లు గెలుపొందారు. ఇక్కడి నుండి గెలిచిన జివి శేషు ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. ఆయన చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేసారు. 1999లో గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా.. ఎర్రగొండ పాలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నాటికి ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
12 సార్లు ఎన్నికలు..
సంతనూతలపాడు లో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి మూడు సార్లు, సిపిఐ -సిపియం ఒక్కోసారి గెలుపొందాయి. వైసిపి ఒకసారి గెలిచింది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచిన విజయ్ కు మార్ కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరారు. దీంతో..ఆయన 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్దిగా పోటీ చేసారు. మజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు వైసిపి లో చేరారు. ఇక, కాంగ్రెస్ నుండి వైసిపి లో చేరిన సురేష్ కుమార్ ఇక్కడి నుండి వైసిపి అభ్యర్దిగా పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 201813 ఓట్లు ఉండగా, అందులో167389 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన సురేష్ కు 80954 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన విజయ్ కుమార్ కు 79678 ఓట్లు వచ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన సురేష్ 1276 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ నుండి గెలిచిన సురేష్ కుమార్ వైసిపి లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారు. వైసిపి అధినేత జగన్ తో సన్నిహితంగా ఉంటున్న సురేష్ జిల్లాలో కీలకంగా మారారు.












Click it and Unblock the Notifications