ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

నెల్లూరు జిల్లా రంజైన రాజ‌కీయాల‌కు చిరునామా స‌ర్వేప‌ల్లి. ఈ నియోజ‌క‌వ‌ర్గం లో జిల్లా సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లైన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న‌రెడ్డి..ఆదాల ప్ర‌భాక‌ర రెడ్డి ఇక్క‌డి నుండి ప్ర‌త్య‌ర్ధులుగా పోటీ ప‌డ్డారు. ఇక్క‌డి నుండి చంద్ర మోహ‌న రెడ్డి రెండు సార్లు.. ప్ర‌భాక‌ర రెడ్డి రెండు సార్లు గెలుపొందారు. 2009 లో నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తోట‌ప‌ల్లి గూడూరు, ముత్తుకూరు, మునుగోడ‌లు, పొద‌ల కూరు, వెంక‌టాచ‌లం మండ‌లాలు స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం లో ఉన్నాయి. స‌ర్వేపల్లిలో గెలిచిన బెజ‌వాడ గోపాల‌రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయాల్లోనూ ఒక‌రి పై ఒక‌రు వ్యూహాత్మ‌కంగా దెబ్బ తీసుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు..

14 సార్లు ఎన్నిక‌లు..
1955 లో ఏర్పాటైన స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి దాకా 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో అధికంగా కాంగ్రెస్ ఏడు సార్లు గెలుపొందింది. టిడిపి నాలుగు సార్లు, స్వ‌తంత్ర అభ్య‌ర్ధి ఒకసారి, సిపిఐ ఒక‌సారి, వైసిపి ఒక‌సారి గెలుపొందా యి. ఈ నియెజ‌క‌వ‌ర్గం తిరుప‌తి లోక్‌స‌భ ప‌రిధిలో ఉంటుంది. ప్ర‌స్తుతం టిడిపి లో ఉన్న సీనియ‌ర్ నేత ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇక్క‌డి నుండి రెండు సార్లు, అల్లూరు నుండి ఒక‌సారి గెలుపొందారు. ఇక్క‌డి నుండి 1955లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బెజ‌వాడ గోపాల‌రెడ్డి ఆ త‌రువాతి కాలంలో గ‌వ‌ర్న‌ర్ గా..కేంద్ర మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు.

#AndhraPradeshElections2019: All about Sarvepalli Constituency

2014 ఎన్నిక‌ల ఫ‌లితాలు..
2014 ఎన్నిక‌ల లెక్క‌ల ప్ర‌కారం స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ల‌క్ష‌ల 3518 మంది ఓట‌ర్లు ఉన్నారు. అందులో ల‌క్షా 72 వేల 686 మంది ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కాగా, ఇక్క‌డి నుండి పోటీ చేసిన వైసిపి అభ్య‌ర్ధి కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి కి 85744 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్ధి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న రెడ్డికి 80298 ఓట్లు ద‌క్కాయి. 2014 ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్ధి కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి 5446 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలుత కాంగ్రెస్ లో ఉన్న కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి ఆ త‌రువాత వైసిపి లో చేరారు. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మితో వ‌రుస‌గా మూడు సార్లు ప‌రాజ‌యం పాలైన సోమిరెడ్డి ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ ఏపి వ్య‌వ‌సాయ శాఖా మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+