ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఉదయగిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజవర్గ పునర్విభజన లో భాగంగా.. కావలి -ఆత్మకూరు మండలాల్లో ఉండే 20 గ్రామాలు..వింజమూరు, కొండా పురం, జలదంకి, కలిగిరి మండలాలు ఉదయగిరి నియోజవర్గాల్లో చేరాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మేకపాటి సోదరులు ఇద్దరూ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారదు. ఆ తరువాత మేకపాటి రాజమోహన రెడ్డి ఎంపీగా నెల్లూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. సామాజిక సమీకరణాలు..వర్గాలు ఇక్కడి రాజకీయ గెలుపు ఓటముల పై ప్రభావం చూపిస్తాయి. వైయస్ మరణం వరకు కాంగ్రెస్ లో ఉన్న మేకపాటి సోదరులు ఆ తరువాత జగన్ తో కలిసి వైసిపి లో కొనసాగుతున్నారు..
1952 నుండి ఎన్నికల్లో..
ఉదయగిరి నియోజకవర్గం 1952 లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్, స్వతంత్రులు రెండు సార్లు, టిడిపి రెండు సార్లు, కెఎంపిపి ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, బిజెపి ఒకసారి, వైసిపి ఒకసారి గెలుపొందారు. ఇక్కడ నుండి గెలిచిన వారిలో మాదాల జానకీరాం నేదురుమల్లి క్యాబినెట్‌లో మంత్రిగా వ్యవహరించారు. 2012 ఉప ఎన్ని కల్లో ఇదే నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్దిగా పోటీ చేసిన బివి రామారావు ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.

2014 ఎన్నికల్లో..
2014 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 226246 ఓట్లు ఉండగా..175060 ఓట్లు పోలయ్యాయి. అందులో టిడిపి అభ్యర్ధి బివి రామారావు కు 85873 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్ది మేకపాటి చంద్రశేఖర రెడ్డికి 82251 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి రామారావు 2622 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి ప్రస్తుత నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డికి సోదరుడు. మేకపాటి కుటుంబం ఒక ఎంపి స్థానంతో పాటుగా రెండు అసెంబ్లీ స్థానాల నుండి 2014 ఎన్నికల్లో పోటీ చేసింది .అందులో నెల్లూరు లోక్‌సభ, ఆత్మకూరు అసెంబ్లీ స్థానం గెలుచుకోగా, ఉదయగిరి స్థానం నుండి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications