వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి కాంగ్రెస్ నవ్వింది, మజ్లిస్ వెలిగింది (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మున్సిపల్ ఫలితాలు తెలంగాణ కాంగ్రెసు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 2009లో అధికారంలోకి వచ్చిన అనంతరం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ తెలంగాణలో అడుగడుగునా చేదు అనుభవం ఎదుర్కొంది.

ఆ పార్టీ నేతలు సొంత నియోజకవర్గాలలో తిరుగలేని పరిస్థితి కూడా వచ్చింది. అయితే కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గారు.

తెలంగాణలో కొంత మిశ్రమ తీర్పు వచ్చినప్పటికీ కాంగ్రెసు పార్టీకి సానుకూలంగా ఉంది. ప్రజలు తెలంగాణ ఇచ్చామంటున్న కాంగ్రెస్‌పై కొంచెం ఎక్కువ, తెచ్చామంటున్న తెరాస పైన కాస్త తక్కువ ప్రేమను చూపించారు. టిడిపి, బిజెపిలపై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోకుండా ఆ పార్టీలకూ గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

మున్సిపల్ ఫలితాలు తెలంగాణ కాంగ్రెసు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 2009లో అధికారంలోకి వచ్చిన అనంతరం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ తెలంగాణలో అడుగడుగునా చేదు అనుభవం ఎదుర్కొంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఆ పార్టీ నేతలు సొంత నియోజకవర్గాలలో తిరుగలేని పరిస్థితి కూడా వచ్చింది. అయితే కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగినప్పటికీ, ఓటర్లు వేర్వేరు రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరిగినట్లు భావించారు. తెలంగాణ, సీమాంధ్రల్లో భిన్నమైన తీర్పులు వెలువడడమే దానికి నిదర్శనం.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉంది. అక్కడా.. ఇక్కడా కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు బరిలో నిలిచాయి.

కాంగ్రెస్

కాంగ్రెస్

అయినప్పటికీ మున్సిపల్ ఫలితాలు ఇరు ప్రాంతాల్లో ఒకే రకంగా లేకపోవడం గమనార్హం. సీమాంధ్రలో టిడిపి విజయదుందుభి మోగించగా, వైయస్సార్ కాంగ్రెసు రెండో స్థానానికి పరిమితమైంది. అధికార కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ పుర పోరులో మాత్రం కాంగ్రెస్ పైచేయిని ప్రదర్శించింది. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. సీమాంధ్ర ఓటర్లు దాదాపు ఏకపక్ష తీర్పు ఇవ్వగా, తెలంగాణ ఓటర్లు మాత్రం మిశ్రమ తీర్పును ఇచ్చారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణలోని తొమ్మిది జిల్లాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనాన్ని ఎగురవేసింది. నల్గొండ, మెదక్ జిల్లాల్లో పార్టీ ఎక్కువ మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

నల్గొండ, నిజామాబాద్ జిల్లాల మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు సాధించింది. నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, దేవరకొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది.

కాంగ్రెస్

కాంగ్రెస్

కోదాడలోని 30 వార్డుల్లో 14 వార్డులు దక్కించుకుని, ఒక్క వార్డు కోసం ఇతరుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది.

 కాంగ్రెస్

కాంగ్రెస్

నల్గొండ జిల్లా భువనగిరిలోని 30 వార్డుల్లో కాంగ్రెస్, బిజెపి చెరో 8 స్థానాలు దక్కించుకుని అత్యధిక స్థానాలు సాధించిన పార్టీలుగా నిలిచాయి. ఇక్కడ హంగ్ ఏర్పడడంతో టిడిపి గెలుచుకున్న 7 వార్డులు కీలకం కానున్నాయి.

 కాంగ్రెస్

కాంగ్రెస్

నిజామాబాద్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్.. కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. బోధన్ మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో 15 వార్డులు దక్కించుకోగా, ఇతరుల మద్దతుతో ఈ స్థానమూ కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్

కాంగ్రెస్

వరంగల్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జనగాం, నర్సంపేట హస్తగతమయ్యాయి. మహబూబాబాద్‌లోని 28 వార్డుల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో ఏడు వార్డులను గెలుచుకున్నాయి. ఇక్కడ హంగ్ ఏర్పడే పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

మిత్రపక్షమైన సిపిఐకి దక్కిన 3 స్థానాలు, ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు తీసుకుంటే కాంగ్రెస్‌కు మరో వార్డు అవసరమవుతుంది. టిడిపి గెలిచిన మూడు స్థానాలు, సిపిఎం దక్కించుకున్న 5 వార్డుల్లో ఎవరో ఒకరు మద్దతిచ్చినా తమదే పీఠమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్

కాంగ్రెస్

భూపాలపల్లి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్, తెరాస చెరో ఏడు స్థానాలు సాధించాయి. ఇక్కడ ఏ పార్టీ పీఠాన్ని దక్కించుకోవాలన్నా మరో నాలుగు స్థానాలు అవసరమవుతాయి. ఇక్కడ మిత్రపక్షమైన సిపిఐ ఒక్క వార్డును గెలుచుకోవడం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది.

కాంగ్రెస్

కాంగ్రెస్

వరంగల్ జిల్లాలో తెరాసను నిలువరింపజేయడం కాంగ్రెస్‌కు ధైర్యాన్నిచ్చినా, ఈ స్థానాల్లో చైర్మన్‌గిరీని సొంతం చేసుకోవడం అంత సులువు కాదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

కరీంనగర్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల మున్సిపాలిటీలోనే స్పష్టమైన మెజారిటీ సాధించి, పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడి 38 వార్డుల్లో 24 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.

కాంగ్రెస్

కాంగ్రెస్

కోరుట్లలోని 31 వార్డుల్లో 13 వార్డులు, పెద్దపల్లిలోని 20 వార్డుల్లో 6 వార్డులను సాధించుకుని అత్యధిక స్థానాలు సాధించుకున్న పార్టీగా నిలిచింది.

 కాంగ్రెస్

కాంగ్రెస్

ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో.. మంచిర్యాలలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో 14 వార్డులు గెలుచుకుని అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలిచినా... చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే ఇంకా మూడు వార్డుల అవసరమేర్పడుతుంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

మిత్రపక్షమైన సిపిఐ 2 వార్డుల్లో విజయం సాధించింది. ముగ్గురు స్వతంత్రుల్లో ఒకరు మద్దతిస్తే చైర్మన్‌గిరీ కాంగ్రెస్ పార్టీ వశమవుతుంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

అదిలాబాద్ జిల్లాలో నిర్మల్‌ను బిఎస్పీ, భైంసాను మజ్లిస్ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. ఆదిలాబాద్ లాంటి జిల్లాలోనూ తెరాస.. ఆదిలాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకే పరిమితమైంది.

మజ్లిస్

మజ్లిస్

అదిలాబాద్ జిల్లాలోని భైంసాను మున్సిపాలిటీని మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో హైదరాబాదులోని ఆ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు.

మజ్లిస్

మజ్లిస్

అదిలాబాద్ జిల్లాలోని భైంసాను మున్సిపాలిటీని మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో హైదరాబాదులోని ఆ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు.

English summary
Both the Congress and TRS claimed victory in the municipal elections in Telangana with the former getting majority in 23 civic bodies and the latter in nine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X