టి: కిరణ్ ఆట ప్రారంభించారా, నెక్స్ట్ డిప్యూటీ?

Kiran strategy on Telangana Draft Bill
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారంటున్నారు. చివరి బంతి వరకు మ్యాచ్ పూర్తి కాదని, బంతి పడ్డాక సిక్స్ కొట్టాలో.. ఫోర్ కొట్టాలో చూస్తామని కిరణ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లును ఓడించే వ్యూహంలో భాగంగానే మంత్రి శ్రీధర్ బాబును తప్పించిన కిరణ్ తదుపరి వ్యూహాల అమలుకు సిద్ధమవుతున్నారంటున్నారు.

అసెంబ్లీ వ్యవహారాలను నుండి శ్రీధర్ బాబును తప్పించి శైలజానాథ్‌కు అప్పగించారు. శైలజానాథ్ బిల్లును సభలో ప్రవేశ పెడుతూనే.. ఇందులో లోపాలున్నాయని, సరైన సమాచారం లేదని, ఆచరణ సాధ్యం కాదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే వాదనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వినిపిస్తారంటున్నారు. ఇప్పటికే బిల్లుపై చర్చ ప్రారంభమైందని శ్రీధర్ బాబు, తెలంగాణ నేతలు ప్రకటించినా.. ఇది సాంకేతికంగా చెల్లుబాటు కాదని సిఎం చెబుతున్నారు.

శాసన సభ అనుసరించే పద్ధతులు, సంప్రదాయాల ప్రకారం చర్చను ప్రారంభించాల్సిందేనని అంటున్నారు. ఇప్పుడు శ్రీధర్ స్థానంలో శైలజానాథ్ రావడంతో... ఆయనతో బిల్లును లాంఛనప్రాయంగా ప్రవేశ పెట్టించి, చర్చను ప్రారంభింప చేస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సమైక్యవాదాన్ని వినిపించడం, పరిస్థితిని బట్టి సమైక్య తీర్మానాన్ని ప్రతిపాదించడం వంటివి చేయవచ్చునంటున్నారు. అయితే, బిల్లును ఏ రూపంలో వ్యతిరేకిచినా తాము తిప్పికొడతామని తెలంగాణ ప్రాంత నేతలు చెబుతున్నారు.

విభజనను అడ్డుకునేందుకు చివరి బంతి ఉందని చెబుతున్న కిరణ్ తాజాగా తన సహచరుల పైనే బౌన్సర్లు సంధిస్తున్నారు. శ్రీధర్ బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించిన కిరణ్ తాజాగా మరో ఇద్దరు డిప్యూటీలపై బంతులు సంధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కిరణ్ ఇప్పుడు శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) నుంచి ఇద్దరు తెలంగాణ ముఖ్య నాయకులను తప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

బిఎసిలో ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కను తొలుత తప్పించాలని భావిస్తున్నారట. స్పీకర్ అధ్యక్షతన బిఎసి జరిగేటప్పుడు ప్రత్యేక ఆహ్వానితునిగా డిప్యూటీ స్పీకర్ రావాల్సిన అవసరం ఏమిటని ఆయన భావిస్తున్నారు. శాసన సభలో చర్చించే అజెండాను ఖరారు చేసేందుకు స్పీకర్ అధ్యక్షతన జరిగే బిఎసి సమావేశానికి ముఖ్యమంత్రి సభా నాయకుని హోదాలోనూ, ఉప ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రి సభ్యులుగానూ హాజరవుతారు.

అన్ని పార్టీల శాసనసభా పక్షం నాయకులూ బిఎసికి హాజరవుతారు. సభా నాయకునిగా తాను హాజరైనప్పుడు ఉప ముఖ్యమంత్రి బిఎసికి ఎందుకు హాజరుకావాలన్న ఆలోచనతో కిరణ్ కుమార్ రెట్టి ఉన్నారట. తాను హాజరుకానప్పుడు తన స్థానంలో ఉప ముఖ్యమంత్రి హాజరైతే అభ్యంతరం లేదని భావిస్తున్నారు. అయితే, శ్రీధర్ బాబు అంశం దుమారం రేపడంతో కిరణ్ దీనిపై తగ్గుతారా లేక బౌన్సర్ వేస్తారో చూడాలంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+