Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ నక్సలైట్ రాములు హత్య: ఎవరీ నయీమ్?

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో మాజీ నక్సలైట్లకు, నయీమ్ ముఠాకు మధ్య వైరం హత్యల మీద హత్యలకు దారి తీస్తోంది. నయీమ్ అలియాస్ నయీముద్దీన్ కోసం గాలింపు ఎంతగా చేపట్టినా ఫలితం ఉండడం లేదు. మాజీ నక్సలైట్ కోనాపురి రాములు హత్యతో మరోసారి నయీమ్ పేరు తెర మీదికి వచ్చింది. రాములు అన్న సాంబశివుడిని కూడా నయీమ్ ముఠానే హత్య చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

గుజరాతీ గ్యాంగ్‌స్టర్ సొహ్రబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తోన్న సిబిఐ ఆ వ్యవహారంలో నయీం కోసం గాలిస్తోంది. సొహ్రబుద్దీన్‌కు హైదరాబాద్ సహా పలుచోట్ల నయీం బృందం ఆశ్రయం కల్పించిందని, చివరకు ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే గుజరాత్ పోలీసులు ఎన్‌కౌంటర్ పేరిట చంపారనేది సిబిఐ ఆరోపిస్తోంది.

నయీం స్వస్థలం నల్లగొండ జిల్లా భువనగిరి. 1990లో పీపుల్స్‌వార్ రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యారు. యాక్షన్ టీమ్‌ల్లో చురుగ్గా పని చేశారు. అందులోభాగంగా 1993లో ఐపియస్ వ్యాస్‌ని హత్యచేసిన అప్పటి పీపుల్స్ వార్ టీమ్‌లో ఒకడయ్యారు. కొద్ది కాలంలోనే అరెస్టు అయి జైలుకు వెళ్లారు. జైలులో ఆయనకు నాటి పీపుల్స్‌వార్ అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి వంటి వారితో విభేదాలు వచ్చినట్టు చెబుతారు.

Konapuri Ramulu murder: Who is Nayeem

దాన్ని ఆసరా చేసుకొని నయీంని పోలీసులు చేరదీసినట్టు ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తుంటారు. ఏమైనా ఆయన నక్సల్స్‌పై కక్ష పెంచుకున్నారు. నక్సల్స్ అంతు చూస్తానని నయీమ్ బహిరంగంగానే ప్రకటించారు. ఒక బృందాన్ని తయారు చేసుకొన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి హోం మంత్రిగా ఉండగా, ఆయన సొంత జిల్లా నల్లగొండలో నక్సల్స్‌ను ఏరిపారేసేందుకు న యీం సహకారంతోనే అనేక కోవర్టు అపరేషన్లు నిర్వహించారన్న విమర్శలున్నాయి. ఆ తర్వాతి కాలంలో నక్సల్స్ ఎలిమినేటి మాధవరెడ్డిని దారుణంగా హత్యచేశారు. దీంతో నయీం బృందం వ్యూహం మార్చింది.

ప్రజాజీవితంలో ఉన్న నక్సల్ సానుభూతిపరులు లేదా వారికోసమే పనిచేస్తున్న వారిని, హక్కుల సంఘాల ముఖ్యనేతలను టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తం, ఆజం అలీ, తెలంగాణ జనసభ గాయని బెల్లి లలిత, మరో వ్యక్తి కరుణాకర్‌ను దారుణంగా హత్యచేశారు. ఈ హత్యల్లో నయీంపైనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి.

2007 మార్చి నాటికి ఐపియస్ వ్యాస్ హత్యకేసు నాంపల్లి కోర్టులో విచారణ తుది దశకు చేరుకుంది. 2007 మార్చిలో కేసు విచారణకు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయిన ఆయన మాయం అయ్యారు. ఇప్పటి వరకు జాడలేదు. కొనపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడు మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు నయీంకు మధ్య మాటల యుద్ధం జరిగింది. నయీం జాడ కనిపెట్టేందుకు సాంబశివుడు అనేక ప్రయత్నాలు చేశారు.

సాంబశివుడి తల్లిదండ్రులను భయపెట్టడం, ఇంట్లోకి కోడె త్రాచులను వదలడం, టైగర్స్ పేరిట బెదిరించడం వంటివి నయీమ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను ఓ బహిరంగ సభలో సాంబశివుడి తమ్ముడు కొనపురి రాములు స్వయంగా చెప్పారు. చివరకు సాంబశివుడు 2009లో ప్రభుత్వానికి లొంగిపోయారు. జైలు నుంచి విడుదలయ్యాక సాంబశివుడు తెరాస చేరారు. 2011 మార్చిలో సాంబశివుడు హత్యకు గురయ్యారు. ఇలా ఇప్పటిదాకా 19 మంది మరణించారు. తాజాగా, సాంబశివుడి తమ్ముడు రాములు హత్యతో ఈ సంఖ్య 20కి చేరింది. ఓ భూదందాలో ఎదురుపడిన నయీమ్‌తో కొనపురి రాములు ఎదురుపడినట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+