చెట్లు, బిల్డింగ్ ఎక్కి కెసిఆర్‌కి బెదిరింపు (పిక్చర్స్)

హైదరాబాద్: టిక్కెట్ల కేటాయింపులో తెలంగాణ రాష్ట్ర సమితిలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఆ కుటుంబం నుండి కెసిఆర్, తనయుడు కెటి రామారావు, కూతురు కల్వకుంట్ల కవిత, మేనల్లుడు హరీష్ రావు బరిలో ఉన్నారు.

పరకాల సిటింగ్ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతికి కెసిఆర్ ఝలక్ ఇచ్చారు. ఆయకు మొండిచేయి చూపి కొత్త అభ్యర్థి సహోదర్ రెడ్డికి జెండా ఊపారు. పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలలో భిక్షపతి ఒక్కరికే టికెట్ దక్కలేదు. ఆయన చివరి వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

పరకాల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ సహోదర్ రెడ్డి టికెట్ రేసులో ముందున్నప్పటికీ, అప్పుడు అదృష్టం భిక్షపతిని వరించింది. సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం సహోదర్ రెడ్డి తలుపు తట్టింది. భిక్షపతికి టికెట్ రాకపోవటం వెనుక ఇటీవలనే పార్టీలో చేరిన కొండా దంపతుల హస్తం ఉందంటున్నారు.

తెరాస

తెరాస

కాగా, తెరాసలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు కనిపించాయి. మంగళవారం పలువురు నాయకులు, వారి అనుచరులు తెలంగాణ భవన్ వద్ద హంగామా సృష్టించారు.

తెరాస

తెరాస

అసెంబ్లీ టికెట్ల కేటాయింపు తెరాసలో చిచ్చు రేపింది. పార్టీని నమ్ముకొని, ఇళ్లు, ఒళ్లంతా గుల్ల చేసుకొని తెలంగాణ పోరాటం చేసిన వారిని నట్టేట ముంచారని, కొత్తగా చేరినవారిని అందలమెక్కించి వెంటనే టికెట్‌లు కేటాయించారని ఆ పార్టీ కార్యకర్తలు అధిష్టానంపై నిప్పులు చెరిగారు.

తెరాస

తెరాస

మలి జాబితా ప్రకటించగానే మంగళవారం ఉదయం నుంచి తెలంగాణ భవన్‌వద్ద అసంతృప్త నేతలు వారి మద్దతు దారులు ఆందోళనకు దిగారు.

తెరాస

తెరాస

గోషామహల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఆర్వీ మహేందర్ అనుచరులు తెలంగాణ భవన్‌పైకి ఎక్కి, పెట్రోలు పోసి నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. మరో ఇద్దరు భవనంపై నుంచి దూకుతామని బెదిరించారు. చివరకు ఆందోళనకారులను నచ్చచెప్పి, భవనం పై నుంచి కిందికి దింపారు.

 తెరాస

తెరాస

అంతకు ముందు కోఠి(హైదరాబాద్)లోని తెరాస పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకారులు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.

తెరాస

తెరాస

గోషామహల్ తెరాసను టికెట్‌ను మంగళవారం ఉదయమే చేరిన టిడిపి నాయకుడు ప్రేమ్‌కుమార్ దూత్‌కు కేటాయించడమే మహేందర్ వర్గీయుల అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.

తెరాస

తెరాస

నర్సాపూర్ టికెట్‌ను అగ్రకులాల వారికే కేటాయించారంటూ మెదక్ జిల్లా తెరాస కార్యదర్శి జింక వెంకటేష్ ముదిరాజ్, ఆయన అల్లుడు జింక శ్రీశైలంలు చేసిన ఆందోళనతో తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తెరాస

తెరాస

జింక శ్రీశైలం కిరోసిన్ డబ్బాతో చెట్టెక్కి, వంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. ఒక దశలో అగ్గిపెట్టెతో నిప్పంచుకోవడానికి అతడు ప్రయత్నించారు.

తెరాస

తెరాస

ఇద్దరు కార్యకర్తలు చెట్టుపైకి ఎక్కి, శ్రీశైలంను కిందికి దించారు. మరోపక్క వెంకటేష్ నిద్రమాత్రలు మింగగా పోలీసులు అడ్డుకొని తీసుకెళ్లిపోయారు.

తెరాస

తెరాస

తెరాసను వీడి, కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ అనుచరులు, అభిమానులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా తెలంగాణ భవన్‌లోనే కూర్చోని, ఆందోళన చేపట్టారు.

తెరాస

తెరాస

వికారాబాద్ టికెట్ సంజీవరావుకు కాకుండా చంద్రశేఖర్‌కే ఇవ్వాలంటూ వారంతా నినాదాలు చేశారు. ఓ దశలో వికారాబాద్ అభ్యర్థి సంజీవరావు నేరుగా ఆందోళనకారులను నచ్చచెప్పడానికి ప్రయత్నించిన ఫలితం దక్కలేదు.

తెరాస

తెరాస

సాయంత్రం తెరాస నేతలు కె కేశవరావు, నాయిని నర్సింహా రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చేరికల సభ జరుగుతున్నప్పుడు కూడా వికారాబాద్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా నాయిని మందలించారు. పార్టీ విషయాన్ని బహిరంగంగా చర్చించబోమని తర్వాత నిర్ణయం తీసుకుంటామని నాయిని స్పష్టం చేశారు.

తెరాస

తెరాస

వరంగల్ జిల్లాలోని పరకాల అసెంబ్లీ టికెట్‌ను మొలుగూరి భిక్షపతికే కేటాయించాలని కోరుతూ ఏకు కిరణ్ అనే కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తెరాస

తెరాస

మంగళవారం పరకాల పద్మశాలి భవన్‌లో ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

తెరాస

తెరాస

సహోదర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడా న్ని నిరసిస్తూ సభలో పలువురు మాట్లాడుతున్న తరుణంలో కిరణ్ కిరోసిన్ బాటిల్‌తో వేదిక సమీపంలోకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని భిక్షపతికి టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశాడు.

తెరాస

తెరాస

టిక్కెట్ల కేటాయింపులో తెలంగాణ రాష్ట్ర సమితిలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఆ కుటుంబం నుండి కెసిఆర్, తనయుడు కెటి రామారావు, కూతురు కల్వకుంట్ల కవిత, మేనల్లుడు హరీష్ రావు బరిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+