విభజన: హైదరాబాద్‌పై మూడు ఆప్షన్లు ఇవే

Three options on Hyderabad
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే ముందుకు సాగాలనే పట్టుతో కాంగ్రెసు అధిష్టానం ఉంది. ఆ మేరకే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ వస్తోంది. సీమాంధ్ర నాయకుల ఒత్తిడిని, సీమాంధ్రలో చేలరేగుతున్న ఉద్యమాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకోవాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. అయితే, హైదరాబాద్ మాత్రమే పీటముడిగా మారినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. దీంతో కాంగ్రెసు అధిష్టానం హైదరాబాదుపై మూడు ఆప్షన్లను పరిశీలిస్తోంది.

హైదరాబాదుపై మూడు ఆప్షన్లకు సంబంధించి శాసనసపరమైన, పాలనాపరమైన విధానాలను, వాటి లాభనష్టాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు అధికారులకు సహకరిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

హైదరాబాద్‌ను చండీగడ్ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయడం ఒకటి కాగా, రెండోది - సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం మేరకు హైదరాబాద్‌ను పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేసి, పదేళ్ల తర్వాత తెలంగాణకు అప్పగించడం. మూడోది - దేశానికి రెండో రాజధానిగా చేయడం.

చండీగఢ్ ఎలా ఉంది...

హైదరాబాద్‌ను చండీగడ్ తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయడం అనేది మొదటి ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దాద్రా - నాగర్ హవేలి, డయ్యూ డామన్‌లలాగా చండీగఢ్ కూడా ఒక కేంద్ర పాలిత ప్రాంతం. అయితే... పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని కూడా ఇదే. ఆ రెండు రాష్ట్రాల హైకోర్టు, సచివాలయాలు, శాసనసభ భవనాలు, ఇతరత్రా అనేక కార్యాలయాలు చండీగఢ్‌లో ఉన్నాయి. 1966లో పంజాబ్ నుంచి హర్యానాను విభజించినప్పుడు చండీగఢ్‌ను పదేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ప్రకటించి, కేంద్ర పాలిత ప్రాంతం హోదా కల్పించారు.

పదేళ్ల తర్వాత చండీగఢ్ పంజాబ్‌కు చెందాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ నగరం యూటీగానే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పాలనే కొనసాగుతోంది. కేంద్రం తరఫున 'అడ్మినిస్ట్రేటర్' ఇక్కడ పాలనను పర్యవేక్షిస్తారు. ఆయనకు కేంద్ర సర్వీసుకు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు సహకరిస్తారు. ఈ ముగ్గురి పర్యవేక్షణలో ఇతర ఐఏఎస్‌లు పరిపాలన నిర్వహిస్తారు. అయితే, చండీగఢ్‌కు కూడా ప్రత్యేకంగా నగరపాలక సంస్థ ఉంది. మేయర్‌ను, కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకుంటారు.

చండీగడ్‌లాగా చేయాల్సి వస్తే హైదరాబాద్ పరిధిని విస్తరించాల్సి వస్తుంది. సీమాంధ్రకు ఏ విధమైన అడ్డంకులు లేకుండా రహదారి ఏర్పాటు ఉండాలి. అంటే, మధ్యలో తెలంగాణ రాష్ట్ర భూభాగాలు రాకుండా చూడాలి. ఈ విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) పరిధిని విస్తరించాలి. మరో 13 గ్రామాలను కూడా కలుపుతూ దీని పరిధి విస్తరించారు. దీంతో చండీగడ్ తరహా యుటిగా హైదరాబాద్‌ను చేయడానికే ఈ పనిచేశారనే మాట వినిపిస్తోంది.

పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని..

హైదరాబాద్‌ను పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలుగా ఉంచడం రెండో ప్రత్యామ్నాయం. పదేళ్లలోపు సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటవుతుంది. ఆ తర్వాత హైదరాబాదును పూర్తిగా తెలంగాణకు అప్పగిస్తారు. ఈలోపు హైదరాబాద్‌లోని శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అంటే, దాదాపుగా ఢిల్లీ తరహా విధానం హైదరాబాదులో పదేళ్ల పాటు ఉంటుంది. సీమాంధ్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై కొత్త శాసనసభ నిర్ణయం మేరకు జరుగుతుంది.

దేశం రెండో రాజధానిగా..

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయడం మూడో ప్రత్యామ్నాయం. దేశానికి హైదరాబాదును రెండో రాజధానిగా చేసి, తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు వేర్వేరుగా రాజధానులను ఏర్పాటు చేస్తారు. అంటే, హైదరాబాదు అటు సీమాంధ్రకు గానీ ఇటు తెలంగాణకు గానీ చెందదు.

సీమాంధ్ర రాజకీయ నాయకులు మొదటి, మూడో ప్రత్యామ్నాయలకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ రెండు ప్రతిపాదనలను కూడా తెలంగాణ నాయకులు ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం కూడా రెండో ప్రత్యమ్నాయం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా రెండో ప్రత్యామ్నాయాన్ని అమలు చేయడమే మంచిదనే అభిప్రాయంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+