చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళకు కౌంటర్: దీపా వ్యూహం, పోటెత్తుతున్న ఫ్యాన్స్

అదును చూసి చిన్నమ్మ శశికళను దెబ్బ తీయాలని జయలలిత మేనకోడలు దీపా అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఆమె ఇంటికి అభిమానులు పోటెత్తుతున్నారు. అయినా ఆమె వేచి చూద్దామంటున్నారు...

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు చిన్నమ్మ శశికళ ఓ వైపు పావులు కదుపుతుండగా జయలలిత మేనకోడలు దీపా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తన ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శశికళను అదును చూసి దెబ్బ కొట్టేందుకు ఆమె సమాయత్తమైనట్లు ప్రచారం సాగుతోంది.

అసంృతృప్తితో ఉన్న అన్నాడియంకె నేతలు, పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు చెన్నైలోని టీ నగర్‌లో గల దీపా ఇంటికి పెద్ద యెత్తున తరలివస్తున్నారు. వారిని ఆప్యాయంగా నమస్కారం పెడుతూ వారిని పలకరిస్తూ సహనం వహించాలని ఆమె బోధిస్తున్నారు.

ఆమె వ్యవహారశైలి చూస్తుంటే అదును చూసి శశికళను దెబ్బ కొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. జయలలితను తలపించే విధంగా ఆమె వ్యాఖ్యలు, హావభావాలు, ఆంగిక చాలనం ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

నేనే అంటూ ఆమె....

నేనే అంటూ ఆమె....

మీడియాతో దీపా స్పందిస్తున్న తీరు కూడా ఆమె మేనత్త జయలలితను తలపిస్తున్నాయని ప్రశంసిస్తున్నారు. మేనత్త వారసురాలిని తానే అని, రాజకీయాల్లోకి వస్తానని ఆమె ఇప్పటికే చెప్పారు. ప్రస్తుతం అన్నాడియంకెలో సాగుతున్న రాజకీయ పరిస్థితులను ఆమె నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో...

ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో...

దీప ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ ప్రకటన కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. శశికళపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు దీపా వైపు మొగ్గు చూపుతారని అంటున్నారు. శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేదాకా దీపా నిరీక్షిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.

అదే ఆమెను నడిపిస్తుందా...

అదే ఆమెను నడిపిస్తుందా...

అన్నాడియంకెలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు శశికళను వ్యతిరేకిస్తున్నారు. అదే దీపాకు అనుకూలాంశంగా మారుతుందని అంటున్నారు. ప్రజాబలానికి అదే నిదర్శనమని కూడా దీపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, డిఎంకెలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. స్థాలిన్ పూర్తి స్థాయిలో తెర మీదికి వచ్చారు. దీంతో దీపా అడుగులు ఎలా వేస్తారనేది వేచి చూడాల్సిందే.

ఇలా అవుతోంది...

ఇలా అవుతోంది...

ఇప్పటికే దీపా పురట్చి మలర్ పేరవై తిరుచ్చి వేదికగా ఏర్పాటు కావడం, అమ్మ డిఎంకె చెన్నై వేేదికగా నామకరణం జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో దీపాను ఆహ్వానించేందుకు తగిన ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. శశికళను ఈ వేదికను ఆసరా చేసుకుని దీపా ఎదుర్కుంటారా అనేది కూడా చూడాల్సే ఉంది.

English summary
Will Deepa stops Sasikala in Tamil politics?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X