ఇజ్రాయెల్‌లో బాలీవుడ్ నటి మిస్సింగ్..
ఇజ్రాయెల్‌లో బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా మిస్స్ అయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రికత్తల నేపథ్యంలో బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా ఇజ్రాయెల్‌లో అదృష్యమయ్యారనే వార్త బీ టౌన్ వర్గాలను కలవరపెడుతుంది. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుష్రత్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు. అయితే నటి శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చివరిసారిగా టీమ్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది.
రెండు దేశాల మధ్య యుద్ధం : ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. హమాస్ ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిసిస్తోంది. అయితే, నిన్నటి వరకు టీమ్‌తో ఉన్ననటి మధ్యాహ్నం నుంచి నుష్రత్ కు, ఆమె టీమ్‌తో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె టీమ్ సభ్యులు నుష్రత్ జాడ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చివరిసారిగా ఫోన్‌లో : నుష్రత్ భరూచాకు, ఆమె టీమ్ కు మధ్య శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చివరి సారిగా సంభాషణ జరిగిందని, అప్పుడు ఆమె అందరితో పాటు సురక్షితంగా ఉన్నానని తన టీమ్ మెంబర్‌కు తెలిపినట్లు 'ఇండియా టీవీ' కథనం ప్రకారం తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి నుష్రత్ నుంచి ఎటువంటి సమాచారంగానీ, కమ్యూనికేషన్ గానీ లేదని తెలిపారు. నుష్రత్‌ను సురక్షితంగా మనదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీమ్ మెంబర్‌లో ఒకరు తెలిపారు. ఎలాంటి గాయాలు లేకుండా ఆమె తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు టీమ్ మెంబర్ చెప్పారు.
బాలీవుడ్‌లో 25 సినిమాలు చేశారు : ఈమె తెలుగులో శివాజీ సరసన తాజ్‌మహల్ మూవీ (2010)లో నటించారు. బాలీవుడ్‌లో 25 సినిమాల్లో నటించారు. తెలుగు, హిందీ సినిమాలే కాకుండా నుష్రత్ తమిళంలో కూడా సినిమాలు చేశారు. అయితే ఈమె చివరిసారిగా నటించిన చిత్రం అకెల్లి. దీనికి ప్రణయ్ మెష్రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక థ్రిల్లర్ డ్రామా. ఈ చిత్రంలో నుష్రత్ ఓ పోరాట ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటకు రావడానికి కష్టపడే ఒక సాధారణ భారతీయ మహిళ పాత్రలో నటించారు. అయితే, రీల్‌లో తీసిన దృశ్యాలే ఆమె నిజజీవితంలోనూ ఎదురయ్యాయి. ఆమె సురక్షితంగా భారత్‌కు తిరిగి రావాలని అందరం కోరుకుందాం.












Click it and Unblock the Notifications