వర్షాకాలం బట్టలు ఆరక దుర్వాసన వస్తున్నాయా? అయితే ఈ టిప్స్ ట్రై చేసి చూడండి!!

వర్షాకాలం వచ్చిందంటే బట్టలు ఆరేయడం అతి పెద్ద సమస్య. వర్షాలు పడుతుండే క్రమంలో బట్టలు సరిగ్గా ఆరవు. ఎండ తగలకుండా ఉండటం వల్ల బట్టలు సరిగా ఆరక దుర్వాసన వస్తూ ఉంటాయి. ఇక ఈ దుర్వాసన వెదజల్లుతున్న బట్టలను వేసుకోవాలంటే దానిని మించిన కష్టం మరొకటి ఉండదు. అందుకే వర్షాకాలం బట్టలు దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వర్షాకాలంలో బట్టల నుండి దుర్వాసన రాకుండా బట్టలు తాజాగా ఉండాలంటే ముందు బట్టలను ఆరేసేటప్పుడు ఎప్పుడూ గదిలో బాగా గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. వర్షం వల్ల బయట ఆరేయడానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే వాటిని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆరని బట్టల నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉండటంతో దుర్వాసన రాకుండా బట్టలు ఉతికేటప్పుడు కాస్త నిమ్మరసాన్ని జోడిస్తే అవి దుర్వాసన రాకుండా ఉంటాయి.

wetclothes

ఒకవేళ బట్టలు దుర్వాసన వెదజల్లుతుంటే వాటి పైన కొద్దిగా నిమ్మరసాన్ని స్ప్రే చేసుకుని ఆ తర్వాత గాలిలో ఆరబెట్టి ఆ తర్వాత బట్టలు వేసుకోవచ్చు. ఇక బట్టలు దుర్వాసన వెదజల్లుతూ ఉంటే వెనిగర్ వేసి రుద్ది నీళ్ళల్లో ఉతికి ఆరబెడితే ఆ వాసన మాయమవుతుంది. వెనిగర్ లో ఉండే ఆమ్ల స్వభావం కారణంగా అది దుర్వాసన కలిగించే ఫంగస్ ను నిర్వీర్యం చేస్తోంది.

ఇక బేకింగ్ సోడా కూడా బట్టలు నుంచి దుర్వాసనను తొలగిస్తుంది. బట్టలు ఉతికేటప్పుడు వెనిగర్ తో పాటు కాస్త బేకింగ్ సోడాని కూడా కలిపితే బట్టలు చెడు వాసన రాకుండా ఉంటాయి .ఇక వర్షాకాలంలో బట్టల విషయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు బట్టలను ఎక్కువ సేపు నానబెట్టకూడదు. వాషింగ్ మిషన్ లో వాష్ చేసిన బట్టలను తర్వాత ఆరెయ్యొచ్చు అందులోనే వదిలిపెట్టకూడదు.

ఇక తడిసిన బట్టలు ఉతకకుండా పక్కన పెట్టడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే బట్టలు ఖచ్చితంగా చెడు వాసన వస్తాయి. కాబట్టి వర్షాకాలంలో బట్టలు విషయంలో కాస్త శ్రద్ధ పెట్టడం అవసరం. బట్టలు సరిగ్గా ఆరకపోవడం వల్ల బట్టలు పెట్టే సెల్ఫ్ లలో కూడా అదోలాంటి వాసన వస్తుంది. కాబట్టి బట్టలు పెట్టే సెల్ఫ్ ల లో నాప్తలీన్ గోలీలు వేయడం అసలు మర్చిపోవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+