వర్షాకాలంలో విద్యుత్ తో జర భద్రం!! తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

దేశమంతా ఎప్పుడెప్పుడు రుతుపవనాలు వస్తాయా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. వర్షాకాలం ప్రారంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాలలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

రహదారులపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా మ్యాన్ హోల్స్ ను, కరెంటు హోల్స్ ను గమనించుకొని వాటికి దూరంగా వెళ్ళటం మంచిది. వర్షాకాలంలో అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ తీగ తగలకుండా ఉండేలా చూసుకోవాలి.

Rainy season precautions with electricity !! Be careful!!

తడి చేతులతో కరెంటు స్విచ్ లు ఆన్, ఆఫ్ చేయకూడదు. ఇంట్లో ఎక్కడైనా విద్యుత్ తీగలకు జాయింట్స్ ఉంటే వాటిని ఒకసారి ఎలక్ట్రీషియన్ తో మార్పించుకోవాలి. రహదారి వెంట ఉన్నటువంటి విద్యుత్ పోల్స్ ను పొరపాటున కూడా తాకకూడదు. విద్యుత్ తీగ సర్వీస్ వైర్ కు సపోర్ట్ గా ఉండే జి వైర్ ప్లాస్టిక్ తొడుగు ఉండేలా చూసుకోవాలి.

విద్యుత్ తీగలు ఎక్కడైనా షార్ట్సర్క్యూట్ అవుతున్నట్టు గమనిస్తే వెంటనే మెయిన్స్ ఆఫ్ చేసి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. తెగి పడిపోయినా, ఎత్తు తక్కువగా ఉన్న కరెంటు తీగలను తాకకూడదు. రోడ్డుపైన విద్యుత్ తీగలు తెగి పడి పోయినట్లుగా గమనిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు. కనీసం వాటి దగ్గరగా కూడా ఉండకూడదు.

అపార్ట్మెంట్ సెల్లార్ లోకి నీళ్లు చేరి విద్యుత్ తీగలు తగిలినా, మీటర్ల దాకా వచ్చినా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. వ్యవసాయ పనులు చేసే రైతులు కూడా వర్షం పడుతున్న సమయంలో వ్యవసాయ మోటార్లను ఆన్ చేయకూడదు. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల పక్కన నిలబడకూడదు. పశువులను సైతం విద్యుత్ తీగలకు, ట్రాన్స్ఫార్మర్ లకు దూరంగా ఉంచాలి.

ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడటానికి పొరపాటున కూడా ఐరన్ రాడ్స్ వాడకూడదు. చెక్క లేదా ప్లాస్టిక్ తో చేసినటువంటి వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ఇక వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకొని విద్యుత్తు మన పాలిట ప్రాణాంతకంగా మారకుండా చూసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+