వేచి చూస్తున్న విజయశాంతి మునిసిపల్‌      లోగుట్టు    వేచిచూస్తున్నవిజయశాంతిమునిసిపల్‌ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణఉద్యమకారిణి

ఎంకి పెళ్ళిసుబ్బి చావుకొచ్చినట్టుంది హైదరాబాద్‌ ట్రాఫిక్‌పోలీసుల పరిస్ధితి. నెలకు కొత్తగా మూడువేలకు పైగా కార్లు రోడ్ల మీదికిరావడంతో తీవ్రమైన ట్రాఫిక్‌సమస్యలు తలెత్తుతున్నాయి. టూవీలర్లపెరుగుదల శాతం తక్కువగాఉండగా కార్ల పెరుగుదల శాతంఅధికంగా ఉంది. ఇప్పుడు నగరంలో 2.52లక్షల కార్లు ఉన్నాయి. ఐదేళ్ళలో కార్లువందశాతం పెరిగాయి. లగ్జరీ కార్లసంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోందనిరవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌సిఎల్‌ఎన్‌ గాంధీ చెప్పారు. టూవీలర్‌ కొనే బదులు ఫైనాన్స్‌ సంస్ధలసహాయంతో ఫోర్‌వీలర్‌ కొనుక్కోవడానికే ఇష్టపడుతున్నారనిఆయన చెప్పారు. పాతకార్ల మార్కెట్‌కూడా బాగా పెరుగుతోంది. ఉన్న కార్లనుతీసేసి కొత్త మోడల్స్‌ కొనుక్కుంటున్నవారి సంఖ్య పెరగడంతో పాత కార్లవ్యాపారం కూడా బాగా సాగుతోంది. అమీర్‌పేటసంజీవరెడ్డినగర్‌ ఖాళీ స్ధలాల్లో ఫర్‌సేల్‌ అనే పాత కార్లు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

వైఎస్‌పైజనార్‌ధనాధన్‌!

నేదురుమల్లిజనార్ధనరెడ్డితో ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డికి కష్టాలుమొదలైనట్టే. వృద్ధాప్యం మీదపడినా నేదురుమల్లి కాంగ్రెస్‌లో ఒకవర్గానికి నాయకత్వం వహిస్తున్నారు.ముఖ్యమంత్రిగా కొంతకాలమే పనిచేసినా ధనార్జనరెడ్డిగా ఆయనకు ముద్ర పడింది.అంగ, అర్ధ బలం పుష్కలంగా ఉన్న ఆయనకుఅధిష్టానవర్గం వద్ద కూడా పలుకుబడిఎక్కువే. దిగ్విజయ్‌ సింగ్‌ వంటి నేటి ఎఐసిసినాయకులకు జనార్ధనరెడ్డి గురుతుల్యుడు. అయినారాజశేఖరరెడ్డికి కొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో కావచ్చుజనార్ధనరెడ్డి పదిహేను నెలలు ఓపికపట్టారు. తన వర్గానికి చెందినకొందరు నెల్లూరు నాయకులనుకాంగ్రెస్‌లోకి తిరిగి తీసుకోడానికి పిసిసిఅధ్యక్షుడు కె.కేశవరావునిరాకరించగా ఆయన నిన్న అగ్గి మీదగుగ్గిలమయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆనంసోదరులు, కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి జనార్ధనరెడ్డికి బద్ధ శత్రువులుగా ఉన్నారు. వారికి వైఎస్‌అండదండలున్నాయి. రానున్న కొద్ది రోజుల్లోజనార్ధనరెడ్డి వైఎస్‌కువ్యతిరేకంగా చాపకింద నీరులా పనిచేయడంఖాయంగా కన్పిస్తోంది.

చంద్రబాబుకిఇష్యూలు కావలెను!

తెలుగుదేశంఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడికికాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగాఉద్యమాలు చేయాలన్న ఉత్సాహమైతే ఉందికానీ మంచి ఇష్యూలు దొరకడం లేదు.మన్యం విషజ్వరాలపై తెలుగుదేశం నాయకులు ప్రభుత్వనిర్లక్ష్యాన్నిఎండగట్టినా, రోశయ్య నోరువేసుకునిఎదురుదాడి చేయడంతో ఆ ఇష్యూ నీరుగారిపోయింది.నీటిపారుదల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తున్నవైఎస్‌ ప్రభుత్వంపై ఆ అంశం మీదఉద్యమం చేయడానికి ఏమీ లేదు. వశిష్టవాహన్‌ అనే బోగస్‌ సంస్ధకుప్రభుత్వం 11 కోట్లు చెల్లించడం మంచిఇష్యూ అయినప్పటికీ, ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామని వోక్స్‌ వ్యాగన్‌ప్రకటించడంతో ఆ సమస్య నుంచి కూడావైఎస్‌ ప్రభుత్వం గట్టెక్కింది. ఇటీవలరాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలుకురవడం ప్రభుత్వానికి వరంగాపరిణమించింది. ఇక చంద్రబాబు నాయుడు చేయగలిగింది సర్వాంతర్యామి అయినఅవినీతి గురించి. కానీ టిడిపి హయాంలో మాత్రం అదిలేదా?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+