విజయవాడ, హైదరాబాద్‌కు పైప్డ్ గ్యాస్ లోగుట్టు విజయవాడ,హైదరాబాద్‌కు పైప్డ్ గ్యాస్‌రాష్ట్రంలోప్రస్తుతం వంటగ్యాస్
రాష్ట్రంలోప్రస్తుతం వంటగ్యాస్ కొరత ఉన్నవిషయం తెలిసిందే. సిలిండర్ గ్యాస్‌వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. 2008 నాటికివిజయవాడ, హైదరాబాద్ నగరాల్లోగ్యాస్ పైపుల ద్వారా సరఫరా కానుంది.దీనికోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) ఏర్పాట్లు చేసింది. హిందుస్ధాన్‌పెట్రోలియం, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌లసంయుక్త ఆధ్వర్యంలో ఇందుకోసం 200కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా-గోదావరిగ్యాస్ బేసిన్‌కు దగ్గరలోఉన్నందున హైదరాబాద్ కంటే ముందు విజయవాడనగరంలో ముందుగా పైప్డ్ గ్యాస్ రానుంది.విజయవాడలో పైప్ లైన్ నెట్ వర్క్‌కోసం గెయిల్ 57 కోట్లు ఖర్చు చేయనుంది.
పేరున్ననటినటుల, దర్శకుల సినిమాలు బిజినెస్ చేసుకోలేకపోతున్న తరుణంలో హీరోతప్ప అందరూ కొత్త వారితోతయారైన మొదటి సినిమారాష్ట్రంలోనే గాక విదేశాల్లో కూడా బిజినెస్‌సాధించడం ట్రేడ్ వర్గాలనుఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా విదేశీప్రదర్శన హక్కులను కెఎడి పొందింది.సినిమా టైటిలే ఈ ఆసక్తికి కారణమనికొత్త నిర్మాత కుందురురమణారెడ్డి అంటున్నారు. సినిమానుకొత్తగా తీయడం, పాటలు, హాస్యం బాగుండడం వల్లబయ్యర్లు ముందుకొచ్చారని మరోఅభిప్రాయం. ఈ సినిమా టీవీ యాడ్స్ కూడా వెరైటీగా,రిలీఫ్‌గా ఉన్నాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమాలోని అన్ని పాటలు రాశారు.
సంతోష్‌రెడ్డికాంగ్రెస్‌లో చేరరా?
టిఆర్‌ఎస్‌నాయకుడు, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డికాంగ్రెస్‌లో చేరుతారన్నవదంతులు ఉన్నాయి కానీ అదిసాధ్యమయ్యే అవకాశాలు లేవు.ఎందుకంటే శాసనసభ్యుడిగా ఆయనకొనసాగదలచుకుంటే మూడో వంతుటిఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చీల్చవలసి ఉంటుంది.ఇంత పెద్ద ఫిరాయింపును వైఎస్‌ప్రోత్సహించే అవకాశం లేదు. ఒకకారణం ఏమిటంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కుసొంతంగా సంపూర్ణ మెజారిటీ ఉంది. ఉన్నశాసన సభ్యులకే పదవులుఇవ్వలేకపోతుంటే కొత్తగా ఎనిమిది తొమ్మిదిమంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకోవడం కష్టం. రెండో కారణంసంతోష్‌రెడ్డి చాలాకాలంగా వైఎస్‌కురాజకీయ విరోధి. రాజశేఖరరెడ్డి పిసిసిఅధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకుఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కాబట్టిసంతోష్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లోనే ఉండి పోరాటంచేస్తారని అనుకోవాలి.












Click it and Unblock the Notifications
