హోంపేజి
అమెరికాలోని డల్లాస్‌లో టెక్సాస్ కౌబాయ్స్ స్టేడియంలో ఇటీవల గ్రాండ్ దీపావళి మేళా జరిగింది. ఈ వేడుకల్లో డల్లాస్, టెక్సాస్ ప్రాంతాల నుంచి 30, 000 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ అమెరికాలో కార్యక్రమం అనగానే ఏ కొద్దిమంది మాత్రం వస్తారనుకున్నాను. కాని నా అంచనా తప్పింది అన్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చి స్థిరపడ్డ భారతీయులను ఒక గొడుకు కిందకు తీసుకువచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అమెరికాలో నివ సిస్తున్న భారతీయులకు చక్కని భవిష్యత్ ఉందన్నారు. భారతదేశం ప్రతిష్ఠను పెంచేలా ప్రవాస భారతీయులు మెలగాలని రాజ్‌గోపాల్ తన ప్రసంగ ంలో పేర్కొన్నారు. ఈ వేడుకలకు తనను ఆహ్వానించినందుకు ఆయన నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పారు.
ఈ వేడుకల్లో స్థానిక కళాకారులతో ప్రదర్శించిన రామలీల నాటకం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. 150 పాత్రలతో గంటన్నర సేపు సాగిన ఈ నాటకం ఆద్యంతం సభికులకు కనువిందు చేసింది. డల్లాస్‌లో ఇంత భారీ సంఖ్యలో భారతీయులు వేడుకల్లో పాల్గొనడం ఇదే మొదటిసారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీరిలో 40 శాతం మంది తెలుగు వారు ఉండటం విశేమన్నారు. ఇటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా నేటి త రానికి మన సంప్రదాయాలు అవగతమవుతాయని ఆయన అన్నారు. కార్యక్రమం చివరలో నిర్వహించిన రావణ దహనం, బాణా సంచా పేలుడు సభికులకు మరింత ఆన ందోత్సాహాలు కలిగించాయి.
అభినయశ్రీకి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
ఇక కాంగ్రెస్ పార్టీకి సొంత దినపత్రిక