కేంద్ర మంత్రివర్గ విస్తరణ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా అలాగే ఉంది. రాష్ట్ర మంత్రివర్గాన్ని రాజశేఖరరెడ్డి ఈ ఏడాదిలో విస్తరించే అవకాశం లేదు. చిన్న మంత్రివర్గం- చింతలు లేని మంత్రివర్గం అని వైఎస్ నమ్ముతున్నట్టు ఉంది. కానీ మంత్రి పదవులను ఆశిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అసహనం తీవ్రతరమవుతోంది. వైఎస్ మంత్రివర్గంలో తమవారికి ఒక్కరికి కూడా స్ధానం దక్కకుండా పోవడంపై బ్రాహ్మణ, రాజు కుల సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గత మంత్రి వర్గాలన్నిటిలోనూ ఈ రెండు కులాలకు చెందిన ఎమ్మెల్యేలకు కనీసం ఒక మంత్రి పదవి అయినా దక్కేది. రఘువీరారెడ్డి యాదవ్ అని తెలియని వారు ఆ కులంలో చాలా మంది ఉన్నారు. తమ కులానికి చెందిన మంత్రి ఒక్కరూ లేరని ఈ వెనుకబడిన కులంలో అధిక సంఖ్యాకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేల సంఖ్యకు తగినట్టు కనీసం మూడు నాలుగు మంత్రి పదవులు తమకు దక్కాలని కమ్మ కుల నాయకులు వాదిస్తున్నారు. నిన్న జరిగిన కమ్మ కులస్ధుల ఆత్మీయ సభలో అనేక మంది వక్తలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం వైఎస్ కేబినెట్‌లో ఒక్క కమ్మ మంత్రి ( పిన్నమనేని వెంకటేశ్వరరావు) మాత్రమే ఉన్నారు.












Click it and Unblock the Notifications