ఆ సంబంధం ఇంకా స్టార్ట్ కాలేదట!!!
ట్వంటీ-20 వరల్డ్ కప్ లో సిక్స్ ల మీద సిక్స్ లు కొట్టిన యువరాజ్ సింగ్ లవ్ మీద లవ్ చేస్తున్నట్టుంది. కిమ్ శర్మతో కొన్నాళ్లు గడిపిన యువరాజ్ తల్లి కోప్పడడంతో ఆమెను వదిలేశాడు. ఆ తరువాత ఓమ్ శాంతి ఓమ్ హీరోయిన్ అదేనండీ...మహేంద్రసింగ్ దోని స్నేహితురాలు దీపికా పడుకొనేతో రాత్రివేళల్లో ముంబై పబ్ లలో చెట్టాపట్టాలేసుకు తిరిగినట్టు పుకార్లు వచ్చాయి. అయితే తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ దోని తను దీపికతో స్నేహం చేస్తున్నానని స్వయంగా చెప్పడంతో బాగోదనుకున్నాడో ఏమో యువరాజ్ కొత్త మొహాన్ని వెతుక్కున్నాడు. ఆమె అలాంటి ఇలాంటి ఆవిడేం కాదులెండి...సూపర్ మోడల్ అంజలి పాండేనట. వారిద్దరూ ఇటీవలే హీరోహోండా కమర్షియల్స్ షూటింగ్ లో పాల్గొన్నప్పటినుంచి ఇద్దరిమధ్య లవ్ మొదలయిందట. ఇది నిజమా అంటే యువరాజ్ సైలంట్ అవుతున్నాడట. ఇదే విషయాన్ని పాండేను అడిగితే మా ఇద్దరికీ ఏదో అవుతోంది కానీ అది శారీరక సంబంధం దాకా రాలేదని కుండబద్దలు కొట్టింది.












Click it and Unblock the Notifications
